తాను చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఉంది తెలుగుదేశం వ్యవహారం.. ఎన్నికల విధుల్లో తనకు నచ్చిన పోలీసు అధికారులను కోడ్ కూయక ముందే సెట్ చేసి పెట్టుకున్న తెలుగుదేశం ఇప్పుడు ప్రతి చిన్న విషయానికీ రాద్దాంతం చేస్తోంది. 


ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థపై కూడా నిందలు వేస్తోంది. ఈసీ తనకు వ్యతిరేకంగా పనిచేస్తోందని .. మోడీతో కుమ్మక్కయిందని టీడీపీ ఆరోపిస్తోంది.  కేంద్రం తరఫున పోలీస్ పరిశీలకుడిగా ఉన్న కేకే శర్మను తప్పించాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ సీఈసీకి విజ్ఞప్తి చేశారు. 

కేకే శర్మను పశ్చిమ్ బెంగాల్ ఎన్నికల పరిశీలకునిగా నియమిస్తే తృణమూల్ ప్రభుత్వం వ్యతిరేకించిందన్నది టీడీపీ వాదన. అలాంటి వ్యక్తిని ఏపీకి నియమించడం తమకు కూడా అభ్యంతరకరమంటోంది టీడీపీ. శర్మ స్థానంలో మరో అధికారిని నియమించి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని రవీంద్రకుమార్ కోరారు.

ఇప్పటికే ఎన్నికల సంఘం మొదటి షెడ్యూల్‌లోనే ఏపీ ఎన్నికలు కుట్ర పూరితంగా పెట్టిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఎన్నికల పరిశీలకుడినే వద్దంటున్నారు. అంటే.. ఇక చంద్రబాబుకు నచ్చిన అధికారుల జాబితా నుంచి పరిశీలకులను నియమిస్తే ఓకే అన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: