తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అంతర్గతంగా పొత్తు ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలి వరకూ పవన్ కల్యాణ్ చంద్రబాబు, లోకేశ్‌ లపై అంతగా విమర్శలు చేయలేదు. ఇప్పుడిప్పుడే పవన్ కాస్త డోసు పెంచుతున్నా.. జగన్ పై చేసేంతటి విమర్శలు టీడీపీపై లేవన్న సంగతి తెలిసిందే. 


దీనికి తోడు వైసీపీ వర్గాలు ఇప్పుడో కొత్త అనుమానం లేవనెత్తుతున్నాయి. నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిని మిత్రపక్షాలకు ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఆ స్థానంలో ఎందుకు ప్రచారం చేయడం లేదు.. మరోవైపు విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర అంతా తిరిగిన లోకేశ్ గాజువాక, భీమవరం వైపు ఎందుకు చూడటం లేదు.

 పోనీ.. రాష్ట్రమంతా కలియతిరుగుతున్న చంద్రబాబు అయినా సరే.. ఆ రెండు చోట్ల సభలు ఎందుకు పెట్టడం లేదు.. ఇవీ వైసీపీ వర్గాలు అడుగుతున్న ప్రశ్నలు.. వాస్తవానికి ఈ ప్రశ్నల్లో కొంత లాజిక్ కనిపిస్తోంది. 

ఆ రెండు పార్టీల మధ్య లోపాయకారీ ఒప్పందం లేకపోతే.. ప్రచారానికి మొహమాటం ఎందుకు.. పోనీ అది కాకతాళీయంగా జరిగిందే అనుకుందాం.. ఇకనైనా ఆ ప్రాంతాల్లో రెండు పార్టీలు ప్రచారం చేసి.. తమపై వచ్చిన అపవాదును తొలగించుకోవచ్చు కదా.. చూడాలి మరి ఆ ప్రయత్నం జరుగుతుందో లేదో.. 



మరింత సమాచారం తెలుసుకోండి: