ఏపీ ఎన్నికల ఘట్టం చాలా జోరుగా సాగుతోంది. పోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉంది. ఇప్పటివరకూ ఉన్న గ్రౌండ్ ఎనాలసిస్ చూస్తే ఫ్యాన్ పార్టీకే మొగ్గు కనిపిస్తోంది. ఈ విషయం ఇప్పటికే అన్ని సర్వేల్లోనూ... సోషల్ మీడియా రిపోర్టుల్లోనూ వెల్లడవుతోంది. 


అయితే చివరి నిమిషం వరకూ ఏం జరుగుతుందో చెప్పలేం.. ఎందుకంటే.. అవతలప్రత్యర్థి 40 ఇయర్స్ ఇండస్ట్రీ సీనియర్. ఆ అంచనాలకు తగ్గుట్టుగానే చంద్రబాబు చివరి నిమిషంలో బ్రహ్మాస్త్రం బయటకు తీయబోతున్నడని విశ్వసనీయ సమచారం అందుతోంది. 

ఎన్నికల్లో ఎన్ని డైలాగులు చెప్పినా.. కేసీఆర్, మోడీ, జగన్ లను ఎంత తిట్టినా జనంలో ఏమోషన్ కనిపించకపోయే సరికి చంద్రబాబు ఇక బ్రహ్మాస్త్రం బయటకు తీయాలని నిర్ణయించారట. అదే సానుభూతి అస్త్రం.. సరిగ్గా పోలింగ్‌కు ఒకటి, రెండు రోజుల ముందు చంద్రబాబు తీవ్ర అస్వస్థతకు గురైనట్టు చూపుతారని తెలుస్తోంది. 

ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా అలసిపోయిన తీవ్ర అస్వస్థతకు గురైనట్టు చూపితే.. సానుభూతి ఓట్ల వర్షం కురిపిస్తుందని పసుపు దళం ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు 2004 ఎన్నకల ముందు కూడా అలిపిరి బాంబు దాడిలో గాయపడి  చేతికి బ్యాండేజ్ కట్టుకుని ముందస్తుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: