జగన్మోహనరెడ్డి వ్యూహాలు ప్రతిక్షణం మార్చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయదలచు కోలేదని వదిలేయ కూడదని నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా ప్రచారం కంటే పోల్ మేనేజ్మెంట్ లో ఆరితేరిన చంద్రబాబు గడిచిన 2014ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో తన తెలివి తేటలు సీనియార్టీని ఉపయోగించి పోల్ మేనేజ్మెంట్ తో 2వేలు - 1000 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు.  అందుకే ఈసారి జగన్ ఆ పొరపాట్ల కు తావు ఇవ్వవదలుచుకోలేదు అని అంటున్నారు. ఈ సంచలన నిర్ణయం దృఢంగా తీసుకున్నారు.
poll management of chandrababu Vs jagan కోసం చిత్ర ఫలితం
ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ఇప్పుడు ప్లాన్-బి అమలు చేసే పనిలో తన ప్రచారానికి మంగళ వారం అంటే నిన్న స్వల్పవిరామం ఇచ్చారు. పోలింగ్ కు కేవలం 9 రోజులు మాత్రమే వ్యవధి మిగిలిఉన్న నేపథ్యంలో ఆయన పార్టీ సీనియర్ నేతలు - రాజకీయ నిపుణులతో ఈరోజు పోల్ మేనేజ్మెంట్ పై అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే వైసీపీ జిల్లా పార్టీ నేతలు - అభ్యర్థులను రెడీగా ఉండమన్నారు. నిన్న ఈ రోజు వైఎస్ జగన్మొహన రెడ్డి వారితో నేడుగా మాట్లాడనున్నారు. తగ్గట్టు నూతన వ్యూహాలు పన్ననున్నట్లు తెలుస్తుంది.
poll management of chandrababu Vs jagan కోసం చిత్ర ఫలితం
కారణం చంద్రబాబు తనను తాను ఓటమిని నుంచి చిట్ట చివరి నిముషంవరకు కాపాడుకోవటానికి విసుగువిరామం లేకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు. దీన్ని అనేక సందర్భాల్లో అనుభవఙ్జుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ పురుద్ఘాటిస్తూనే ఉన్నారు.
సంబంధిత చిత్రం
అందుకే దాదాపు మూడు సంవత్సరాలు పాదయాత్ర చేసిన జగన్మోహనరెడ్డి అభ్యర్థులను ప్రకటించాక కూడా జిల్లాల పర్యటనలో బిజీ బిజీగా గడుపుతూ ప్రచారం చేస్తు న్నారు.  దీంతో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించలేదు.  అధికార టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇప్పటికే ఉదయం సాయంత్రం పోల్ మేనేజ్మెంట్ పై టెలీ-కాన్ఫరెన్స్ లతో టీడీపీ అభ్యర్థులను జాగ్రదావస్థలో ఉంచుతూ అలెర్ట్ చేస్తున్నారు.
poll management of chandrababu Vs jagan కోసం చిత్ర ఫలితం
దీంతో జగన్ అత్యవసర సమావేశం పెట్టి జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి - పోల్ మేనేజ్మెంట్ పై నిన్న నేడు సమీక్షించనున్నారు. ఇక నేటి నుండే యథావిధిగా ప్రచార కార్యక్రమాలు ఉంటాయని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇకపై బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో గెలుపుపై పోల్ మేనేజ్మెంట్ పై ఖాళీ సమయాల్లో సమీక్షించాలని జగన్మోహనరెడ్డి నిర్ణయించినట్లు సమాచారం.   

మరింత సమాచారం తెలుసుకోండి: