ఎన్నికలు అంటేనే డబ్బుతో కూడుకున్న పని.. ఒక్కో ఎమెల్యే, ఎంపీలు ఎన్నికల సందర్భంగా ఇంతే ఖర్చు పెట్టాలని ఈ సీ కొన్ని పరిమితులు విధించింది. కానీ.. అందుకు వందల రెట్లు ఒక్కో ఎమ్మెల్యే, ఎంపీ ఖర్చుపెడుతుంటారు. 


మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ధన ప్రభావం చాలా ఉంది. ఎన్నికల సమయంలో వందల కోట్లు చేతులు మారుతుంటాయి. కొన్ని చోట్ల ఒక్కో ఓటుకు ఐదు వేల రూపాయలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఎన్నికల్లో గెలుపోటముల్లో కీలక పాత్ర పోషించే డబ్బు విషయంలో ఈసీ, ఈడీ అధికారులు కూడా జాగ్రత్తపడుతున్నారు. డేగ కళ్లతో ప్రతి వాహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ సందర్భంలోనే విజయవాడలో తాజాగా కోటి ముప్పయ్యారు లక్షల నగదు దొరికింది. 

దీన్ని హవాలా సొమ్ముగా గుర్తించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలింగ్‌కు సరిగ్గా మూడు, నాలుగు రోజుల్లో ధన ప్రవాహానికి అడ్డు అదుపూ ఉండదు. మరి ఇప్పుడే ఇంత సొమ్ము దొరికితే ఎన్నికలు పూర్తయ్యేనాటికి ఎన్నికోట్లు దొరుకుతాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: