వైఎస్‌ జగన్.. వైఎస్సార్ సీపీ అధినేత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని దాదాపు ఎనిమిదేళ్లుగా కలలు కంటున్న వ్యక్తి.. గత ఎన్నికల్లో కొంచెంలో అవకాశం కోల్పోయిన వ్యక్తి. మరి ఈసారైనా జగన్ కు అదృష్టం కలసివస్తుందా.. మళ్లీ త్రుటితో చేజారుతుందా..


అసలు జగన్ జాతకం ఏం చెబుతుంది.. ఇప్పుడు అందరి దృష్టి  దీనిపైనే ఉంది. అందుకే జగన్ జాతకాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. అవేంటంటే.. జగన్  హంస మహాపురుష లగ్నంలో పుట్టారు. 

అయితే లగ్నంలో రవి-రాహు కలిసి ఉన్నారు. అందువల్ల ఈయనకు రాజయోగం ఖాయంగా ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. రాజయోగం అంటే గ్రామానికి రాజు కావచ్చు.. మండలానికి రాజు కావచ్చు.. జిల్లాకు రాజు కావచ్చు.. రాష్ట్రానికి రాజు కావచ్చు.

లగ్నంలో రవి- రాహువు కలసి ఉండటం వల్ల ఆ రాజయోగానికి తరచూ రాహువు అడ్డుపడుతున్నారు. ఈ రాహువు ను తొలగించుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన హోమాలు, యాగాలు చేయాల్సి ఉంటుంది. అవి చేస్తే జగన్ కు తిరుగుఉండదని ప్రముఖ జ్యోతిష్యులు ప్రదీప్‌ జోషి చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: