వైఎస్ జగన్.. తండ్రి రాజశేఖర్‌రెడ్డి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నవాడు.. తండ్రిలోని మొండితనం.. సామాన్యుల పట్ల ప్రేమ, నాయకత్వ లక్షణాలు వారసత్వంగా అందుకున్నవాడు. అందుకే తండ్రి తరహాలోనే ముందుకు సాగుతున్నాడు. 


కాంగ్రెస్ అధిష్టానంతో పోరాడినా.. సొంతంగా పార్టీ పెట్టుకుని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా.. ఆ పాదయాత్రలో  ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించినా.. ప్రతి ఘట్టంలోనూ వైఎస్ఆర్‌ ముద్ర జగన్‌ పై ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వైఎస్‌ఆర్‌ బతికున్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన జగన్.. ఆయన మరణంతో ఒక్కసారిగా నాయకుడిగా అవతరించక తప్పలేదు. 

మరి అలాంటి జగన్ గురించి.. వైఎస్సార్ చివరి సారిగా ఏంచెప్పాడు.. కొడుకు గురించి ఏమన్నాడు.. ఈ విషయం తెలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది కదా.. ఆయన కడపలో ఓ సభలో కొడుకు జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు పరిచయం చేశారు. ఆయన సందర్భంలో వైఎస్‌ఆర్ కొడుకు గురించి ఏమన్నారంటే.. 

"ఇడుగో.. నా కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి.. ఈ ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష ఉన్నవాడు.. యువకుడు.. ఉత్సాహవంతుడు.. మీ అందరిలో ఒక్కడిగా.. మీ అందరిలో అన్నగా.. తమ్ముడిగా..అండగా నిలబడి ఉంటాడు. మీ ఆశీర్వాదం కోరుతున్నాడు. యువకుడు మీకు సేవ చేయాలనే ఉత్సాహంతో ఉన్నాడు. ఆశీర్వదించండి."



మరింత సమాచారం తెలుసుకోండి: