తెలంగాణా ఆంధ్రప్రదేశ్ రెండూ సోదర తెలుగు రాష్ట్రాలే. సినిమా పరిశ్రమ రెండింటిది ఒకటే - టాలీవుడ్. సెన్సార్ విధానమూ ఒకటే. ఒక దానికొకటి  సాంప్రదాయంలో పెద్దగా భేదాలు లేవు. ఇప్పుడు అంటే 29 మార్చిన సినిమా తెలంగాణాతో సహా ప్రపంచమంతా విడుదలైంది.  అయితే ఆ అదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు మాత్రం  లేదు.


ఎందుకు? ఇరుగు పొరుగులకు సమన్యాయం ఉండాలి కదా? తేడా ఎందుకు? ఈ సినిమాలో ఏదో ధర్మ సూక్ష్మం ఉంటే ఇరు రాష్ట్రాలవారు సమానంగా అర్ధం చేసుకునే అవకాశం ఉండొద్దా? భౌగోళిక పరిస్థితులేమైనా ఈ సమన్యాయంలో అడ్దుపడ్దాయా? అయినా భారత్ మొత్తానికి ఒకే రాజ్యాంగం ఒకే చట్టం వర్తించేటప్పుడు తెలంగాణా ప్రజలకున్న అవకాశం ఆఫ్ట్రాల్ సినిమా చూసే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు వద్దు?   కారణం భారతీయ న్యాయవ్యవస్థే వివరించాలి.
no release lakshmis ntr in ap కోసం చిత్ర ఫలితం

పై విషయం తెలంగాణాకు ఎందుకు వర్తించదు? అనేది ధర్మసూక్ష్మం తెలిసినవారే విశదీకరించాలి. అదే జరగట్లేదు 


సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు వారు అనుమతి ఇచ్చిన తర్వాత ఏపి హైకోర్టు వారు విడుదలను ఆపడంలో ఔచిత్యం ఉండి ఉండవచ్చు. కాని సామాన్య ప్రజలకు మాత్రం అర్ధం కావటంలేదు అదేఏమిటో?  సెన్సార్ బోర్డు వారు అనుమతి ఇచ్చిన తర్వాత ఒక్క ఏపి హైకోర్టు ఏపిలో మాత్రం విడుదల ఆపడం, నిన్న 3 ఏప్రిల్ రోజు సినిమా చూస్తామని ఏపి హైకోర్టు వారు చెప్పడం, ఆ తరవాత సినిమా చూడకుండానే సుప్రింకోర్టుకు వెళ్లారు కనుక సినిమా చూసేది లేదనటంలోని ధర్మసూక్ష్మ అంతర్లీనత అర్ధంకావటం లేదు సామాన్య మేధస్సుకు.


రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయం దోబూచులాడుతుందేమిటని అంటున్నారు జనం. ఒకసారి సినిమా చూస్తామని,  తరుణం రాగానే ఇప్పుడు చూడం,  అని చెప్పడం చాలా అగమ్యగోచరంగా ఉంది. అంతే కాదు, చూడం అని వదిలేస్తే  "ఒకే" అని సర్దుకునే వారేమో! గాని మరల ఏప్రిల్ 9 కి వాయిదా వెయ్యటం చూస్తుంటే లేనిపోని అనుమానాలు జనహృదయాల్లో ఉదయిస్తున్నాయి-ఏమిటో ఇది?
no release lakshmis ntr in ap కోసం చిత్ర ఫలితం
"సుప్రింకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున సినిమా చూడడం లేదు" అని హైకోర్టు ప్రకటించిందని సమాచారం. అయితే అది ముందుగా తెలిసిన విషయమేగా! అలాంటప్పుడు సినిమా విడుదల ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే లేకపోవటం - లోని న్యాయంలోని అంతర్యం ఏమిటి? 


తెలంగాణాలోను ఆంధ్ర ప్రదేశ్ లోను నందమూరి తారక రామారావు అభిమానులు ప్రేక్షకులు ఒకటి కాదా? ఇరువురు సమానం కాదా? అసలు సినిమా విడుదల మొత్తం ఆపేస్తే పోయేదానికి ఒక చోట విడుదల చేసి మరో చోట విడుదల ఆపేయటమే న్యాయం లోని ఆంతర్యం అర్ధం కాక జనం తల బ్రద్దలు కొట్టుకుంటున్నారు.  హైకోర్టు వారు ఇలా చేయడం  సమంజసం?  ఎందుకంటే  న్యాయవ్యవస్థ ఎప్పుడూ కరక్టే - అనుమానం లేదు - కాని న్యాయం జరిగిన తీరు అందులో విషయం - సాధారణ జనానికి అర్ధం కావటం అవసరం కదా!  
no release lakshmis ntr in ap కోసం చిత్ర ఫలితం
సాధారణ జనానికి అర్ధం కావలసిందేమంటే  "అసలు సినిమా విడుదలలో న్యాయం పాత్ర ఇక్కడ అవసరంలేదే!  ఈసి చెప్పినట్లు సినిమా విడుదల సెన్సార్ బాధ్యత కదా! అని ఉంటే జనానికి సంశయమే ఉండేది కాదు. సెన్సార్ బోర్డువారు అనుమతి ఇచ్చిన తర్వాత హైకోర్టు వారు ఆపడం ఏమిటి? అసలు సినిమా విడుదలపై ఆధిపత్యం సెన్సార్ బోర్డ్ దా? హైకోర్ట్ దా?


హైకోర్ట్ దే ఐతే  అలాంటప్పుడు తెలంగాణా హైకోర్ట్ ఎందుకు విడుదల చేయనిచ్చింది? ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణా ఎంత దూరం? డబ్బున్న వాడు ఖర్చు చేసు కోని వెళ్ళి తెలంగాణాలో చూస్తున్నారు?  డబ్బు లేని వారు ఆంధ్రప్రదేశ్ లో విడుదల కోసం వేచి చూస్తున్నారు. సినిమా చూసే అవకాశం అందరికి సమానం కాదా? 
తెలంగాణలో విడుదల అయింది కనుక ఎపిలో కూడా విడుదల చేసుకోవచ్చు అని చెప్పవలసిన హైకోర్ట్ అలా చేయకపోవటంలోని ఆంతర్యం ఏమిటనేది ప్రజల ప్రధాన సంశయం. 
లక్ష్మిస్ ఎం టీఆర్ ప్రకారం న్యాయం తెలంగాణాకు ఏపికి వేరు వేరా? కోసం చిత్ర ఫలితం
విడుదల సమస్య ఏదైనా ఉంటే రెండు రాష్ట్రాలకు సమానమే కదా!  ఇప్పుడు జనం ఏమంటున్నారంటే - "ఎపిలో ఈ సినిమా విడుదలను టిడిపి వారు ఆపడానికి చేసిన ప్రయత్నం విజయవంతమైంది" అంటున్నారు.  మరి సుప్రింకోర్టు వారేమో విచారణకు తొందరలేదని అన్నారు. రానున్న తొమ్మిదో తారీఖు హైకోర్ట్ ఏం చెప్పబోతుందో? చూడటానికి మనం నిరీక్షించాలి. అయితే ఇక్కడ గమనించాల్సింది " జస్టిస్ డిలెయిడ్ ఈజ్ జస్టిస్ డినైడ్" అనేది సత్యదూరమని దానికి ఉనికి ఉందా? కొన్నిసార్లైనా "జస్టిస్ డిలేయిడ్ ఈజ్ నాట్ జస్టీస్ డినైడ్" అనుకోవాలి  


న్యాయం అందరికి సమానం కాదు. భౌగోళికం కూడా సమానం కాదు. డబ్బు ఖర్చు పెట్టుకొని తెలంగాణా వచ్చి సినిమా చూసిన ఆంధ్రప్రదేశ్ వాసి ఉండవల్లి అరుణ కుమార్ మిగతా ఆంధ్రప్రదేశ్ వాసుల కంటే న్యాయపరంగా వైవిధ్యం ఉన్నవారనుకోవాలా?  

మరింత సమాచారం తెలుసుకోండి: