ఎన్నిక‌ల‌కు మ‌రో వారం రోజుల గ‌డువే ఉంది. వ‌చ్చే 11వ తారీకునే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏపీలో రాజ‌కీయాలు వేడె క్కాయి. ముఖ్యంగా ద్విముఖ పోరే ఉంటుంద‌ని ముందు నుంచి భావించిన‌ట్టే.. ఎన్నిక‌ల వేళ‌కు వ‌చ్చేస రికి కూడా దాదాపు రాష్ట్రంలో ద్విముఖ పోరే అంటే.. ప్ర‌ధానంగా టీడీపీ వ‌ర్సెస్ వైసీపీల మ‌ధ్యే ఉంటుంద‌ని స్ప‌ష్ట‌మైంది. కేవ‌లం ఓ మూడు నుంచి నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే జ‌న‌సేన‌-టీడీపీ-వైసీపీల మ‌ధ్య పోరు ఉంటుంద‌ని తెలుస్తోంది. మిగిలి 170కిపైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీల మ‌ధ్యే పోరు జోరు కొన‌సాగనుంది. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌నాడి ఎలా ఉంది? ఎన్నిక‌ల‌కు కేవ‌లం 7 రోజుల వ్య‌వ‌ధి మాత్ర‌మే ఉన్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఎటు మొగ్గుతారు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. 


పాద‌యాత్ర ఫ‌లం!
ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌జాభిమానం చూర‌గొని అధికారంలోకి రావాల‌ని భావిస్తున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్‌. దీనికి సంబంధించి ఆయ‌న ఇప్ప‌టికే గ్రామీణ స్థాయిలో 3600 పైచిలుకు కిలో మీట‌ర్లు పాద‌యాత్ర చేశారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లిశారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. నేనున్నా! అంటూ హామీ ఇచ్చారు. రాజ‌న్న రాజ్యంలో అంద‌రికి అన్నీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. దీంతో ప‌ట్ట‌ణ ఓట‌ర్ల నాడి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. సంప్ర‌దాయ ఓటు బ్యాంకు మాత్రం గ్రామీణ స్థాయిలో జ‌గ‌న్‌కే జై కొడుతున్నారు. ప్ర‌తి ఒక్కరిమాట కూడా జ‌గ‌న్‌ను జై కొట్టాల‌నే భావిస్తున్నారు. వైఎస్ అందించిన ఫ‌లాలు ప్ర‌స్తుతం త‌మ‌కు అంద‌డం లేద‌నే వాద‌న గ్రామీణ ప్ర‌జ‌ల్లో వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ బాట ప‌డుతున్నారు. 


ఒక్క‌ఛాన్స్ కోసం.. 
అవును! రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎవ‌రి నోట విన్నా.. ఒక్క చాన్స్ ప్లీజ్‌- అనే వ్యాఖ్య వినిపిస్తోంది. ఆఖ‌రుకు అదికార పార్టీ అధినేత చంద్ర‌బాబు నిర్వ‌హిస్తున్న స‌భ‌ల్లోనూ బాబు ఈవ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ మాత్రం ఎందుకు ఇవ్వాలి? అని ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో రాజ‌కీయంగా ఒక్క ఛాన్స్ అనే వ్యాఖ్య చుట్టూ తిరుగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో కేవ లం 1% ఓట్ల తేడాతో తాను ప‌రాజ‌యం అయ్యాన‌ని వ‌గ‌చే.. జ‌గ‌న్ ఇప్పుడు మాత్రం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటు న్నా రు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుస్తున్నారు. రాజ‌న్న బిడ్డ‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాల్సిందే,, అనేలా.. సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఆలోచ‌న‌ను రేకెత్తిస్తున్నారు. 


కుటుంబం మొత్తం.. 
ఎన్నిక‌ల వేడి రాజుకున్న క్ర‌మంలో వైఎస్ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు రోడ్ల మీద‌నే ఉంటోంది. జ‌గ‌న్ స‌తీమ‌ణి.. భార‌తి.. సీమ జిల్లాల‌ను చుట్టి వ‌స్తున్నారు. ప్ర‌చారంలో చంద్ర‌బాబును టార్గెట్ చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రో ప‌క్క‌, జ‌గ‌న్ గ‌డిచిన ఏడాదిన్న‌ర‌గా ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటున్నారు. పాద‌యాత్ర‌, దీక్ష‌లు ఇలా ఏరూపంలో అయినా కూడా జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్యే నిలుస్తున్నారు.ఇక‌, ఆయ‌న‌త‌ల్లి విజ‌య‌మ్మ‌, సోద‌రి ష‌ర్మిల కూడా ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చారు. విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌తి నియ‌జ‌క‌వ‌ర్గంలోనూ ప్ర‌త్యేకంగా రోడ్ షోలు నిర్వ‌హిస్తున్నారు. జ‌గ‌న్‌ను ఎందుకు గెలి పిం చాలో వివ‌రిస్తున్నారు. వీరి స‌భ‌ల‌కు భారీ ఎత్తున స్పంద‌న వ‌స్తోంది. అయితే, ఇవి ఏమేర‌కు ఓట్ల రూపంలో మార‌తాయో చూడాలి. 


ప్ర‌జ‌ల్లో మార్పు!!
ఇక‌, జ‌గ‌న్ ప్ర‌చారంతో ప్ర‌జ‌ల్లో ఆలోచ‌న వ‌చ్చింది. ఒక‌ప‌క్క పోల‌వ‌రం పూర్తికాలేదు. గ‌త ఏడాది డిసెంబ‌రు నాటికే పోల‌వ‌రం నుంచి నీళ్లు ఇస్తామ‌న్నారు. ఇవ్వ‌లేదు. అమ‌రావ‌తి నిర్మాణాలు కాలేదు. గ‌తంలో చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు.. ప‌క్క రాష్ట్రంతోను, కేంద్రంతోనూ గొడ‌వ‌లు పెట్టుకుంటే.. మిగిలేది బూడిదే క‌దా! అనే వ్యాఖ్య‌ల‌ను ఇప్పుడు మ‌ననం చేసుకుంటున్నారు. నిజానికి తెలంగాణ‌లో కేసీఆర్‌తో విభేదిస్తున్న చంద్ర‌బాబు ఏపీకి ఎలాంటి న్యాయం చేయ‌లేర‌నే విషయం స్ప‌ష్ట‌మంది. అయితే, కేంద్రంతోనూ ఇదే ప‌రిస్థితి ఉంటే.. ఇక‌, చంద్ర‌బాబు ప్ర‌జ‌ల ముఖం చూస్తూ కూర్చోవ డం త‌ప్పితే.. ఇక్క‌డ చేసేది కూడా ఏమీ ఉంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఒక్క‌ఛాన్స్ అంటున్న జ‌గ‌న్‌కు ఎందుకు అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. 


టీడీపీ ధీటైన ప్ర‌చారం.. అనేక సందేహాలు!
ఎన్నిక‌లకు స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీ టీడీపీ కూడా అంతే వేగంగా ప్ర‌చారం చేస్తోంది. ముఖ్యంగా త‌న ప్రాధాన్యాలు, త‌న ఎన్నిక‌ల మేనిఫెస్టోల‌ను కూడా ప‌క్క‌న పెట్టి.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ఏదో ఒక విదంగా బ‌ద్నాం చేసే రాజ‌కీయాలే చేస్తున్నారు సీనియ‌ర్ నేత‌, సీఎం చంద్ర‌బాబు అండ్‌కో! ముఖ్యంగా జ‌గ‌న్‌ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లిన ఒక్క ఛాన్స్ - అనే వ్యాఖ్య‌ను చెరిపేసేందుకు స్వ‌యంగా చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ఇప్పుడు బ్రేక్ వేయాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్ అండ్ వైసీపీపై ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: