చంద్రబాబు నాయుడు చేసిన మోసాలకు ఆయన్ని చొక్కా పట్టి నిలదీయాలి, బంగాళా ఖాతంలో కలపాలి, వగైరా..వగైరా.. మాటలు వైసీపీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపినా..సామాన్య ప్రజలు, తటస్థ ఓటర్లు ఏంటీ తన తండ్రి వయసున్నాయన పట్ల ఇలా అంటున్నాడు జగన్ అని అనుకున్నారానాడు.


మరిప్పుడో..చంద్రబాబు నాయుడు గారు, దమ్ముందా..రౌడీలు, అకు రౌడీలు, పిల్లల కిడ్నాపులు, తిండిలో విషయ, లోయలో దూకటం, పెళ్లాం-బిడ్డలు లేనోడు, ఫ్యాక్షనీజం అంటూ చెలరేగి పోతున్న విధానం చూస్తున్న అదే సామాన్య ప్రజ, తటస్థ ఓటర్లు, కొన్ని చోట్ల తెదేపా శ్రేణులు సైతం ఏమయ్యింది చంద్రబాబుకు? కొడుకు వయస్సు నిండు జీవితమున్న వ్యక్తిని పట్టుకొని ఇంత దుర్మార్గంగా నిప్పులు కక్కుతున్నాడంటున్నారు.


ఎండ మంటల కంటే వాడిగా-వేడిగా ఉన్న ఈ ‘చంద్రనిప్పులు’  స్థిత ప్రజ్ఞుడు, అపర చాణిక్యుడు, ఘటనా  ఘటన సమర్ధుడిగా పేరున్న చంద్రబాబు స్థాయిని, తెదేపా స్థాయిని పాతాళానికి తీసుకు వెళ్తుందని తెదేపా అభిమానులు అంటుంటే..చంద్రబాబు నైజం ఇదా అంటున్నారు ఆంధ్రప్రజ. 

మరింత సమాచారం తెలుసుకోండి: