అమిత్ షా.. ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా దేశమంతా మారు మోగుతున్న గుజరాత్ బీజేపీ ప్రముఖుడు.  అపర చాణుక్యుడు, మేథావి, అన్నింటికి మించి ప్రధాని మోదీకి అతి సన్నిహితులలో ఒకరని పేరు ఉంది.  ఏకంగా రాష్ట్రాలకు రాష్ట్రాలనే బిజేపి మయం చేయగల లౌక్యం ఈయన సొత్తు. 


ఇంచు-మించు ఈలాంటి, ఇంతకంటే ఎక్కువ లక్షణాలున్న నాయకుడు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.  ఇలాంటి వాళ్లిద్దరి మద్య వాదం  వివాదం ఎలా ఉంటుంది? సరిగ్గా అలానే ఉంది ఈరోజు నరసరావు పేటలో అమిత్ షా ఎన్నికల ప్రచార ప్రసంగం.


చంద్రబాబు అవకాశ రాజకీయాలను, వాజ్ పేయిను వాడుకున్న విధానానన్ని, అధికారం కోల్పోయిన బీజేపీని దూరం పెట్టిన విధానం..మరల దేశమంతా బిజేపి  నరేంద్ర మోదీ హవా నడుస్తున్న క్రమంలో బీజేపీకి దగ్గరయిన విధానం మళ్లీ అవకాశవాద రాజయాలతో బీజేపీతో దూరం అయిన విధానం ముఖం మీద కొట్టినంత క్లీయర్ గా చెప్పారు అమిత్ షా.  ఇలాంటి బాబుకు ఎన్డీయే తలుపును శాశ్వతంగా మూసేశాయన్నారాయన. 


ఏంటో ప్రతి వారితోనూ తెలుగు వారు తిట్లు పడే పరిస్థితి వచ్చింది ఈ బాబుగారి రాజకీయాల వల్ల అనుకుంటున్నారు ఆంధ్రప్రజ.


మరింత సమాచారం తెలుసుకోండి: