అనంతపురం జిల్లా టీడీపీ కంచుకోట.. ఈ జిల్లాలో మొత్తం 14 స్థానాలు ఉంటే.. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ ఏకంగా 12 స్థానాలు గెలుచుకుంది. వైసీపీ కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అవి కదిరి, ఉరవకొండ. 


మరి ఈసారి ఏమవుతుంది. ఈ జిల్లాలో టీడీపీ, వైసీపీకి ఎన్ని స్థానాలు వస్తాయి. ఈ అంశాలను తెలుసుకునేందుకు ఓ సంస్థ సర్వే చేపట్టింది. ఆ సర్వే వివరాలను యూట్యూబ్‌లో ఉంచారు. దీని ప్రకారం.. అనంతపురం జిల్లాలో టీడీపీ కచ్చితంగా గెలిచే స్థానాల సంఖ్య 3కు పడిపోయింది. 

ఈ జిల్లాలో వైసీపీ కచ్చితంగా గెలిచే స్థానాల సంఖ్య ఐదుకు పెరిగింది. ఈ జిల్లాలో జనసేన ఒక్క సీటుకూడా గెలుచుకునే అవకాశం లేదు.. మరో ఆరు స్థానాల్లో టీడీపీ- వైసీపీ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. సో ఈ ఆరు స్థానాలు ఎవరికి వస్తాయో చెప్పే పరిస్థితి లేదు. 

ఓవరాల్ గా చూస్తే ఈ జిల్లాలోనూ వైసీపీ హవాయే నడిచే అవకాశం ఉంది. టైట్ ఫైట్ నడుస్తున్న 6 స్థానాల్లో కనీసం మూడు గెలుచుకున్నా.. వైసీపీ సంఖ్య ఎనిమిది స్థానాలకు చేరుతుంది. టీడీపీ సంఖ్య ఆరుకు చేరుతుంది. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే.. అనంతపురం, హిందూపూర్ రెండూ వైసీపీ చేజిక్కించుకోనున్నాయని సర్వే అంచనా వేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: