అధికార వర్గం రాజ్యాంగం నిర్వచించిన మూలస్థంబాల్లో ఒకటి. అదిప్పుడు పూఎరిగా భ్రస్టుపట్టిపోయింది. ఎక్జెక్యూటివ్ వ్యవస్థ పాలకమండలితో చేతులు కలిపి సమాజ దోపిడీకి పాల్పడటం మనం చూస్తూనే ఉన్నాం. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఆంధ్ర ప్రదేశ్ పొలీస్ బాస్ - డీజీపీ ఆర్పీ ఠాకూర్‌.
AP Police ACB head Sankhabrata bagchi కోసం చిత్ర ఫలితం
ఇటీవల టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడంతో డీజీపీ ఠాకూర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. దీంతో వెల్లువెత్తిన పిర్యాదులకు స్పంధించిన కేంద్ర ఎన్నికల సంఘం హుటా హుటిన ఆర్పీ ఠాకూర్‌ను ఢిల్లీకి పిలిపించింది. డిజిపి భాధ్యతలతో పాటు అదనంగా ఏసీబీ బాధత్యలు నిర్వహించే ఆర్పీ ఠాకూర్‌ నుంచి ఏసీబీ బాధత్యలు తప్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా  ఆదేశాలు జారీ చేయడంతో ఈ విషయం  చర్చనీయాంశమైంది.  
AP DGP RP Tagore And CM Chandrababu కోసం చిత్ర ఫలితం
ఏసీబీ డీజీ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించి ఆ కొత్త ఏసీబీ డీజీగా శంఖబ్రత బాగ్చికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా జీవో జారీ చేశారు. డీజీపీ కావడానికి ముందు ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్‌ పని చేశారు. డీజీపీగా పదవి చేపట్టిన తర్వాత కూడా ఆర్‌పీ ఠాకూర్‌ ఏసీబీని తన ఆధ్వర్యంలోనే ఉంచుకున్నారు. చంద్రబాబు ఆదేశాలంతో ఏసీబీ డీజీగా కొనసాగుతూ చరిత్రలో ఎన్నడూ లేని సంప్రదాయానికి తెరతీశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి "సునీల్ అరోరా" తో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ భేటీ అయ్యారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ జీవో వివాదంపై ఈసీ వివరణ కోరినట్లుగా తెలిసింది. నేడు మరోసారి ఎన్నికల సంఘం ముందు డీజీపీ హాజరు కానున్నారు.

AP DGP RP Tagore with CEC Sunil Arora కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: