అసలు పోల్ సర్వె నివేదికలను నమ్మాలా? వద్దా? అనే సంశయం పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆంధ్ర జ్యోతి దినపత్రిక ఇటీవల  “సీఎస్ ఈఎస్-లోక్ నీతి సర్వే సంస్థ” పేరుతో ప్రచురించిన నివేదిక అబద్ధమని తేలటంతో సర్వేల ప్రయత్నం మొత్తం తన విశ్వసనీయత కోల్పోయాయి. అంతేకాదు హైదరాబాద్ లో కొన్ని సోషల్ మీడియా సంస్థలు తెలంగాణా ఇంటెలిజెన్స్ పేరుతో సృష్టించిన వీడియోలు పూర్తి భూటకమని ఎఫైఆర్ లు రిజిస్టర్ అవటం జనాన్ని నిస్తెజానికి గురిచేశాయి.


ఇలా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని చెప్పిన ఈ సర్వేలే మొత్తం బోగస్ అని తెలటంతో ఈ న్యూస్-ఎక్స్ పోల్ స్ట్రాట్ ఆంధ్రజ్యోతిలో తొలిసారి వార్త రావటంతో ఇది నిజమేనా?  అనె సంశయం సర్వత్రా నెలకొంది. అయినా ఇందులో విశేషం పరిశీలిద్ధాం. 
టీడీపీకి 92 సీట్లు... వైసీపీకి 77 సీట్లు..!
సార్వత్రిక  ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే అన్ని పార్టీల నేతలు ప్రచారం దూసుకుపోతున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో గెలిచి నిలిచేది ఎవరు? పరాజయాన్ని మూటగట్టుకునేది ఎవరు? అనే దానిపై ఉత్కంఠమైన చర్చ సాగుతూనే ఉంది. దీనిపై ఇప్పటికే పలు సర్వేలు వచ్చినా,  తాగాజా న్యూస్ ఎక్స్ పోల్‌స్ట్రాట్ సర్వే ఆసక్తిరేపుతోంది. ఇక ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం ఏపీలో టీడీపీ తిరిగి అధికారాన్ని స్వాధీనం చేసుకోనుంది.


గత ఎన్నికలతో పోలిస్తే 10 సీట్లు తగ్గి 92 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. ఆ పార్టీ ఓటు షేరు 37 శాతంగా ఉండబోతోంది. మరోవైపు ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతం కంటే సీట్లు పెరగనున్నాయి. 2014 ఎన్నికలతో పోలిస్తే 10 సీట్లు పెంచుకుని 77 సీట్లు సాధించనుందని సర్వే నివేదిక చెబుతోంది. ఆ పార్టీ ఓటు షేరు 35 శాతంగా ఉండబోతోంది. అంటే అధికార, ప్రతిపక్షం మధ్య ఓట్ల తేడా కేవలం 2 శాతంగా ఉండబోతుందన్నమాట.

ఇక గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని నివేదికలు చెబుతున్నాయి. 13 శాతం ఓటు షేరుతో ఆ పార్టీకి 4 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చి.. ఎన్నికల్లో గెలిచాక చెయ్యిచ్చిన బీజేపీకి 9 శాతం ఓట్లు, ఒక సీటు వస్తాయని అంచనా వేసింది. మరోవైపు బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలతో కలిసి బరిలోకి దిగిన జనసేన పార్టీ పేరును ఎక్కడా ఈ సర్వే పేర్కొనలేదు. అసెంబ్లీ సీట్లలో ఇతరులకు 1 సీటు అని మాత్రం పేర్కొంది.


పార్లమెంట్ స్థానాల విషయంలోనూ టీడీపీ సత్తా చాటనుంది అని సర్వే నివేదిక పేర్కొంది. 40 శాతం ఓట్లతో 16 సీట్లతో టీడీపీనే ముందుంది. ఇక 37 శాతం ఓట్లతో వైసీపీ 9 సీట్లు తన ఖాతాలో వేసుకోనుంది. కాంగ్రెస్‌ పార్టీకి ఎంపీ సీట్లలో 6 శాతం ఓట్లు, బీజేపీకి కేవలం 3 శాతం ఓట్లు మాత్రమే రానున్నాయి. ఈ రెండు జాతీయ పార్టీలకు కూడా ఎంపీ సీట్లు వచ్చే అవకాశం లేదని సర్వే తేల్చింది. 


మరోవైపు ఏపీ ముఖ్యమంత్రిగా ఎవరైతే మంచిది అనే ప్రశ్నకు చంద్రబాబు అయితే మంచిదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. 46 శాతం మంది చంద్రబాబుకు ఓటేస్తే  వైసీపీ అధినేత జగన్‌కు 39 శాతం మంది మద్దతు తెలిపారు. ఇతరులకు 10 శాతం మంది ఓటేయగా 5 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: