Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 10:11 pm IST

Menu &Sections

Search

తెలుగు పత్రికల సర్కులేషన్ తగ్గటానికి కారణం తెలుసా?

తెలుగు పత్రికల సర్కులేషన్ తగ్గటానికి కారణం తెలుసా?
తెలుగు పత్రికల సర్కులేషన్ తగ్గటానికి కారణం తెలుసా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అంతర్జాతీయ స్థాయిలో పత్రికల సర్కులేషన్ గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆసియా, దక్షిణ అమెరికా దేశాల్లో పత్రికలకు డిమాండ్ ఎక్కువగా ఉందని స్వీడన్ దేశంలో జరిగిన అంతర్జాతీయ వార్తా పత్రికల సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. విక్రయించే పత్రికల సర్కులేషన్ గత 2007 సంవత్సరం నుండి ప్రపంచ వ్యాప్తంగా 2.6 శాతం మేర పెరిగింది. వీటిలో ఎక్కువగా భారత్, చైనా దేశాలే అగ్రస్థానంలో ఉన్నాయి.

ap-news-telangana-news-news-papers-circulation-why

ఈ రెండు రెండు దేశాల మార్కెట్‌ అతి పెద్దదిగా వుంది. ఈ దేశాల మార్కెట్‌ లో ప్రతి రోజు 107 మిలియన్ల కాపీలు విక్రయమవుతున్నట్టు "వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్‌పేపర్స్" ప్రకటించింది. అయితే యూఎస్, యూరప్ దేశాల్లో చదవరుల సంఖ్య తగ్గిపోతుంది. డిజిటల్ మీడియా, ఉచితపత్రికల పంపణీవల్ల సాంప్రదాయ పత్రికలు తీవ్రపోటీని ఎదుర్కొంటున్నట్టు ఆ స్టడీ వెల్లడించింది.

ap-news-telangana-news-news-papers-circulation-why

అమెరికాలో గత ఏడాది మూడు శాతం, యూరోప్‌లో 1.9 శాతం మేరకు సర్కులేషన్ పడిపోయినట్టు నివేదికలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల కాలం లో యూఎస్‌లో ఐదు శాతం మేరకు సర్కులేషన్ పడిపోయిందని ఆ స్టడీ వెల్లడించింది. అలాగే ప్రకటనల ఆదాయం కూడా ఒక్క యూఎస్ మినహా మిగిలిన రీజియన్‌ లలో గణనీయంగా పెరిగింది. యూఎస్‌లో మాత్రం 2007 సంవత్సరంలో 3 శాతం మేరకు తగ్గింది. అదే సమయంలో ఇంటర్నెట్ ప్రకటనల ఆదాయం ప్రపంచ వ్యాప్తంగా 32 శాతం మేరకు పెరిగడం గమనార్హం.


ఇకపోతే తెలుగు పత్రికల పరిస్థితి వేరేలా ఉంది. ఊరంతా ఒక దారైతే ఉలిపిరికట్టె దారి వేరన్నట్లు ఎన్నికల ముందు ఊహించని పరిణామం అదీ ప్రపంచ దేశీయ పత్రికల లాగా కాకుండా తెలుగు పత్రికల సర్కులేషన్ భారీగా  ఢమాల్  అంటోంది. ముఖ్యంగా రేటు పెంపు  ప్రభావం పత్రికలపై ఈసారి ఎక్కువగా ఉంది. అయితే రేటు పెంచని పత్రికలపై ఈ ప్రభావం పెద్దగా లేదనే చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రెండు ప్రముఖ పత్రికల సర్కులేషన్ గత కొన్నినెలలుగా భారీగా తగ్గుతూ వస్తోంది. అయితే అగ్రస్థానంలో ఉన్న పత్రిక మెల్లమెల్లగా రికవరి బాటలో పయనిస్తోంది. తగ్గిన సర్కులేషన్ ను పెంచుకునే పనిలో పడింది. అయితే ఇప్పటికే దాదాపు కోల్పోయిన సర్కులేషన్ ను తిరిగి సాధారణ స్థితికి తెచ్చుకుంది

ap-news-telangana-news-news-papers-circulation-why

ఏపీలో అధికార పార్టీకి అడ్డగోలుగా సపోర్టు చేసే పత్రిక సర్కులేషన్ మాత్రం దారుణంగా పడిపోయిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో రిపోర్టర్లకు ప్రస్తుతం ఉన్న యాడ్స్ బాధ్యత లతో పాటు తగ్గిపోతున్న సర్కులేషన్ నిలబెట్టే బాధ్యతలు అప్పగించారు. ఎలాగైనా సరే తగ్గిన సర్కులేషన్ పెంచాల్సిందే అంటూ యాజమాన్యం ఒత్తిడి చేస్తుండటం తో లబోదిబో మనటం వారి వంతు అవుతోంది.  ఈ ఒత్తిడి తట్టుకోలేని కొంత మంది రిపోర్టర్లు అధికారుల వద్ద తమ గోడు చెప్పుకుని లబోదిబో మంటున్నారు.


కొన్ని పత్రికలు అసలు ఏపీ ప్రభుత్వంలో జరిగే అక్రమాలు, కుంభకోణాలను వదిలేసి పూర్తిస్థాయి ‘భజన’ లో మునిగిపోవటం కూడా దీనికి కారణంగా ఉందని ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వ్యాఖ్యానించారు. ఏపీలో చంద్రబాబు సర్కారు ప్రతి స్కీమ్ ను స్కామ్ గా మార్చినా ‘వాచ్ డాగ్ ’లా ఉండాల్సిన పత్రికలు మాత్రం అవన్నీ వదిలేసి నిత్యం ప్రత్యర్ధులను టార్గెట్ చేసి అధికార పార్టీకి పూర్తిస్థాయి అండదండలు అందిస్తున్నాయి. దీంతో సాక్ష్యాత్తూ కొంత మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా అసలు పత్రికల్లో చదవటానికి కూడా ఏమీ ఉండటం లేదని నిత్యం భజన కార్యక్రమాలే అంటూ వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.

ap-news-telangana-news-news-papers-circulation-why

ap-news-telangana-news-news-papers-circulation-why

పెరిగిన రేట్లతో ఒక్క పేపర్ కే నెల బిల్లు ₹250/- దాటుతోంది. ₹300/- పెట్టి జియో ఫోన్ లో  డేటా వేయించు కుంటే ఒక్క పత్రిక ఏంటి?. తెలుగులో ఉన్న ప్రధాన పత్రికలు అన్నీ ఉచితం గా చదువుకోవచ్చు. ముఖ్యంగా కొత్తతరం అంతా ఈ-పేపర్ వైపే మొగ్గుచూపుతున్నారు. పేపర్ బిల్లుకు పెట్టే డబ్బుతో డేటా కొనుగోలు చేసి ఇతర అవసరాల కు కూడా వాడుకోవచ్చు కదా? అన్న భావనలో చాలా మంది ఉన్నారు. 


రాబోయే రోజుల్లో ఎక్కువ మంది పత్రికల కొనుగోలుకు స్వస్తి చెప్పి ఈ- పేపర్ మార్గాన్ని ఎంచుకునే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పత్రికలతో పోలిస్తే డేటా చౌక కావటం దీనికి ప్రధాన కారణంగా ఉంది. తెలంగాణ ప్రాంతం లోని ప్రముఖ పత్రిక సర్కులేషన్ కూడా ఎన్నికల అనంతరం దారుణంగా పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. అది ఇప్పట్లో కొలుకునే అవకాశం కూడా లేదంటున్నారు ప్రస్తుత ట్రెండ్ ను చూసి.

ap-news-telangana-news-news-papers-circulation-why
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబు దెబ్బకు పునేఠా ఏబీ వెంకటేశ్వరరావు వ్యక్తిగత రికార్డుల్లో 'రెడ్-మార్క్స్'
మూడో దశ పోలింగ్ లో "బంగారు కోడి పెట్ట"!
ఎడిటోరియల్: గురివింద తన కింద నలుపెరగదట! తెలుగుదేశం అధినేత అంతే!
మణిరత్నం హిస్టారిక్ డ్రీం-ప్రొజెక్ట్-నయన్ ప్లేసులో స్వీటీ అనుష్క!
చంద్రబాబు అధికారంపోతే బ్రతకలేరా! మరైతే ఈ రాజ్యాంగ వ్యతిరేఖ పనులేమిటి?
టిడిపి గుండాగిరికి హైకోర్ట్ నోటీసులు: అధికారాంతమందు చూడవలె!
సిఎం - సిఎస్ మద్య సాండ్-విచ్ అయిపోతున్న అధికారులు! పని సంస్కృతి వారికి తెలియదా?
రధి ప్రియాంక - సారధి చంద్రబాబు - అప్పుడు నరేంద్ర మోదీకి కనిపించేది నక్షత్రాలే!
వారణాసి నుండి ప్రియాంక గాంధి, నరేంద్ర మోడీతో పోటీ పడితే.....!?
అనుక్షణం ఘర్షణ పడే చంద్రబాబులో ఏదో మానసిక సంఘర్షణ  ఉన్నట్లే!
తెలుగు ప్రజల వ్యక్తిగత డేటా ఐటీగ్రిడ్ చేతి గాలిలో దీపం చేశారు: ఈఏఎస్‌ శర్మ
మహిళా ఐఏఎస్ ఆఫీసర్ పై చేయి చేసుకున్న ఎక్స్-సిబీఐ జేడి వి వి లక్ష్మినారాయణ!
బాబు ప్రభుత్వంపై  హరిప్రసాద్ ప్రమేయం అధికమట-ఈవీఎం విషయంలో చేసే యాగీ అంతా ఒక డ్రామానే!
శ్రీవారి పాదాలు నర్తించిన రవీంద్ర భారతి రసరమ్య వేదిక
తాత మనవళ్ళు మూట ముల్లే సర్ధుకుంటారా?  దెవె గౌడ ఫామిలీ పాక్
వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కార్యకర్తల పోలింగ్ బూత్స్ ఆక్రమణ: 10 రాష్ట్రాల్లో పోలింగ్ కూల్:
కుమారస్వామి! నువ్వు 100 సార్లు స్నానం చేసినా గేదె లాగే కనిపిస్తావు: గతి తప్పుతున్న విమర్శలు
ఐటీ గ్రిడ్స్‌ కు పబ్లిక్ డేటా అందజేసింది ఎవరు? వారికి గుండెల్లో గుబులే!
సుమలత తరపున ప్రచారం చేసినందుకు "కేజేఫ్ హీరో యశ్" పై  సిఎం ఫైర్
 ఎపిలో రాష్ట్రపతి పాలన?
ఏపిలొ నేమ్-ప్లేట్ పోలిటిక్స్? అసలు నేమ్-ప్లేట్ ఎవరు తయారు చేయిస్తారు?
చంద్రబాబు మిత్రపక్షం డిఎంకె కనిమొళి రాజ్యంలో భీభత్సంగా నగదు! ఎన్నిక జరుగుతుందా?
About the author

NOT TO BE MISSED