చరిత్ర పునరావృతం అవుతుందా? ఒకనాడు దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఒకవైపు ఇందిరా గాంధి మరోవైపు ఉండి జరిగిన ఎన్నికల సమరంలో ఇందిరా గాంధి అజేయశక్తిగా అనితరసాధ్య విజయం సాధించారు. ఇప్పుడు ఈ 2019 సార్వత్రిక ఎన్నికలు కూడా నరేంద్ర మోడీ తో అన్నీ ప్రతిపక్షాలు ఢీ కొనబోతున్నాయి. అంటే "మోడీ వర్సెస్ ఆల్" అన్నమాట. 

అయితే ఈ చారిత్రాత్మక విజయం సాధించటానికి నరేంద్ర మోడీ సంకల్ప బలమే ఆయన్ని ముందుకు నడిపించవచ్చు. అయితే అన్నీ మంచి శకునములే అన్నట్లు 
నరేంద్ర మోదీకే ప్రజామోదం, రాహుల్ కంటే నాలుగింతలు ఎక్కువ అని తేలింది. 63శాతం ప్రజలు ఆయన వెంటే.  నవంబర్-జనవరి 2018 లో నిర్వహించిన "నేషనల్ ట్రస్ట్ సర్వే"  కన్నా ప్రస్తుత సర్వేలో ప్రధాని మోదీ పట్ల 10 శాతం జనామోదం పెరిగింది. కాగా అదే సమయంలో రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల 10 శాతం జనామోదం తగ్గింది. గత సర్వేలో రాహుల్ నాయకత్వం పట్ల 26.9 శాతం మంది జనామోదం తెలపగా, ఈ దఫా సర్వే లో కేవలం 16 శాతం మంది మాత్రమే రాహుల్ గాంధి పట్ల మొగ్గు చూపారు.
 The National Trust Survey 2019 logo FINAL  
ఫస్ట్ పోస్ట్ నేషనల్ ట్రస్ట్ సర్వే లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల 63 శాతం మంది ప్రజలు తమ ఆమోదం తెలిపారు. అదే సమయంలో ప్రతిపక్ష రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల కేవలం 16 శాతం మాత్రమే ఆమోదం లభించింది. అంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ పట్ల రాహుల్ గాంధీ కన్నా నాలుగు రెట్లు నమ్మకం అధికంగా ఉన్నట్లో నేషనల్ ట్రస్ట్ సర్వే లో ప్రస్ఫుటమవుతోంది. గత సర్వే కన్నా ప్రధాని మోదీ పట్ల 10 శాతం విశ్వాసం పెరిగినట్లు తేలింది.


మార్చి 2నుంచి 22తేదీల మధ్య దాదాపు 31వేల ఓటర్ల శాంపిల్‌ తో "ఫస్ట్‌పోస్ట్ - ఐపీఎస్‌ఓఎస్‌" నిర్వహించిన సర్వేలో పలు అంశాల వారీగా అభిప్రాయ సేకరణ జరిపారు 
ఇందులో ప్రధానంగా నరేంద్ర మోదీ పాలన పలు కీలక అంశాల్లో పెరుగుతున్న సానుకూలత ప్రస్ఫుటమవ్వడం విశేషం. ఈ సర్వే రెండు ప్రధాన మీడియా సంస్థలు అంటే  ఫస్ట్‌పోస్ట్ - సి ఎన్ ఎన్ న్యూస్ 18 నేషనల్ ట్రస్ట్ సర్వే నిర్వహించాయని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: