ఎన్నికల ప్రచారం జోరు పెంచిన జగన్.. ఆ ప్రచారంలోనే వచ్చే మంత్రివర్గానికి సంబంధించిన ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఆయన మొదటగా.. చిలకలూరిపేట సభలో ఓ నేతను మంత్రిని చేస్తా అని ప్రకటించారు. చిలకలూరిపేటను గెలిపించండి.. రాజశేఖర్‌ ను మంత్రిని చేస్తానని ప్రజల మధ్య ప్రకటించారు. 


గుంటూరు జిల్లాలో మొదటి మంత్రిని ప్రకటించిన జగన్ ఇప్పుడు ప్రకాశం జిల్లాలో రెండో మంత్రిని ప్రకటించారు. ఈసారి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి బరిలో దిగిన ఆయన బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రిగా ప్రకటించేశారు. వాసన్న మంచివాడు.. సౌమ్యుడు.. మీ అందరికీ మేలు చేస్తాడు.. మంచి మెజారిటీతో గెలిపించండి.. మంత్రిని చేసి మీ ముందు ఉంచుతాను అని ప్రకటించేశారు జగన్. 

తాజాగా మరో వైసీపీ అభ్యర్థికి కూడా జగన్ ఇలాంటి ఆఫర్ ఇచ్చారు. కుప్పంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోటీ చేస్తున్న చంద్రమౌళిని గెలిపిస్తే...మంత్రిని చేస్తానని కుప్పం ఎన్నికల సభలో వైఎస్ జగన్ ప్రకటించారు. కుప్పంకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. 

చంద్రబాబు మెజార్టీని సాధ్యమైనంతవరకు తగ్గించాలనే ఉద్దేశంతోనే జగన్ ఈ రకమైన ప్రకటన చేసి ఉండొచ్చు. వీరితోపాటు భీమవరంలో పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తున్న గ్రంధి శ్రీనుకు కూడా మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంటే క్యాబినెట్‌పై జగన్ ఇప్పటికే ఓ అంచనాకొచ్చేశారన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: