రూరల్ మీడియా.. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ పరిస్థితులపై రిపోర్టింగ్ చేసే మీడియా.. కమర్షియల్ హంగులు లేకుండా.. సేవాభావంతో గ్రామీణ సమస్యలను ప్రపంచానికి నివేదించడమే ఈ మీడియా లక్ష్యం.. ఈ సంస్థ తాజాగా ఏపీలోని ఎన్నికల నేపథ్యంలో సర్వే నిర్వహించింది. 


ఈ సర్వేలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ సంస్థ ప్రకటించింది. అలాగే చంద్రబాబు సర్కారు మైనస్ పాయింట్లను విశ్లేషించింది. దీని ప్రకారం చంద్రబాబు సర్కారు కొంప ముంచే అంశాలు ఇవే.. 

టీడీపీ,జనసేన పార్టీ నాయకులు ఆంధ్రా వాళ్లను తెలంగాణా లో కొడుతున్నారు  అని పదే పదే ప్రచారం చేయడం వల్ల, రాజకీయ స్వార్దం కోసం ఆ రెండు పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు పెంచుతున్నారనే భావన విద్యావంతుల్లో  తీవ్రంగా ఉంది. 

రాష్ట్రంలో విద్యుత్‌ లేని కుగ్రామాల సంఖ్య రెండు వందలకు పైగా ఉన్నట్టు మా పరిశీలనలో తెలిసింది.  కరెంట్‌ బల్బ్‌ ఎలా ఉంటుందో మాకు ఇప్పటి వరకు తెలీదు. సెల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌కి రెండు కిలోమీటర్లు పోవాలి. మా గ్రామం మీద తరుచూ ఏనుగులు దాడి చేస్తుంటాయి, అయినా అధికారులు మా వైపు చూడరు. అని చిత్తూరు జిల్లా,మాధవరం కుయ్యవంక గ్రామస్తులు మాతో చెప్పారు. విశాఖ జిల్లా,పాడేరు ఏజెన్సీలో వందలాది కుటుంబాలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. నైపుణ్యం ఉన్నవారికి కూడా ఉపాధి అవకాశాలు దొరకడం లేదని నెల్లూరు జిల్లా, తడ సమీపంలోని ఒక ఐటీఐ చదివిన నిరుద్యోగి మాతో అన్నారు. రాని ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా బతుకు తెరువు కోసం మట్టిపనులు చేసుకొని బతుకుతున్నాం.. అని అరకు సమీపంలోని పెద్దలబుడు యువకుడు మాతో అన్నాడు. ఆ గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్నారు. 

వృద్దులు,వికలాంగులు, రైతులకు అందాల్సిన కొన్ని పథకాలలో జన్మభూమి కమిటీల జోక్యం ఎక్కువగా ఉందని, దానివల్ల లబ్దదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దాదాపు అన్ని ప్రాంతాల ప్రజల నుండి వస్తున్న ఆరోపణ. 

మారు మూల పల్లెల్లో ప్రాధమిక విద్యకు పిల్లలు దూరం అవుతున్నారు. గత ఐదేళ్లలో 11305 కిలో మీటర్లు గ్రామీణ రహదారులు వేసినట్టు ఉపాధి
హామీ పథకంలో లెక్కలున్నప్పటికీ, సరైన రహదారులు లేవన డానికి ఉదాహరణ, విజయనగరం జిల్లా, బోరి గ్రామంలో పిల్లలు బడికి వెళ్లాలంటే కాలువలు ఈదుతూ వెళ్తున్న దృశ్యం రికార్డు చేశాం.

రాష్ట్రవ్యాప్తంగా 87వేల కోట్లకు పైగా, రైతు రుణాలున్నాయి. వీటిలో 24వేల కోట్ల రుణాల్ని మాఫీ చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. మిగతా 63వేల కోట్ల రుణాల సంగతేంటి? ఐదేళ్లలో విడతలవారీగా రుణాలన్నీ మాఫీ చేసేస్తామని చెప్పిన టీడీపీ సర్కారు ఆ అంశాన్ని పట్టించుకోక పోవడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. 

ఈ అంచనాలన్నీసమగ్రమూ, సంపూర్ణం అని మేం చెప్పబోవడం లేదు. మేం స్వయంగా కలిసిన గ్రామీణులు, పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్ధలు ద్వారా అందిన సమాచారాన్ని విశ్లేషించి ఇచ్చిన సర్వే ఇది. అంతిమంగా ప్రజలు ఏం నిర్ణయిస్తారో అదే జరుగుతుంది.   లేదా.. ruralmedia.in వెబ్‌సైట్‌ చూడవచ్చు. https://ruralmedia.in/rural-media-opinion-poll/



మరింత సమాచారం తెలుసుకోండి: