ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు సంతోషకరమైన మేనిఫెస్టో రిలీజ్ చేశారు.  ముస్లిం మైనార్టీలను దృష్ణీలో పెట్టుకొని ముఖ్యంగా అతి పేద ముస్లింల చేయూత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకు వస్తామని తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 

వక్ఫ్‌ బోర్డు, ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిర-చర ఆస్తులను రీసర్వే చేయించి పూర్తిస్ధాయిలో శాశ్వత ప్రాతిపదికన వాటిని పరిరక్షిస్తూ స్థిరాస్తులను డిజిటలైజ్‌ చేయించి , ఆయా వర్గాల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేస్తామని అన్నారు.   

ఇమామ్‌లకు ఇళ్ల స్ధలాలు కేటాయించి వారికి ఇళ్లు కట్టిస్తాం..  మసీదులో ఇమామ్‌లు, మజమ్‌లకు గౌరవ వేతనం కోసం నెలకు రూ 15,000 ఇస్తామన్నారు.  ప్రమాదవశాత్తూ ముస్లిం, మైనారిటికి చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి  వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా రూ 5,00,000 ప్రకటించారు.  ఏపిలో ప్రతి ముస్లీం యువతకు తగిన ఉద్యోగ ప్రాదాన్యత ఇస్తామని..విద్యాభివృద్దికి కృషి చేస్తానని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: