బాబు చాలా గట్టివాడు, ఎన్నికలను ఎలా గెలవొచ్చో ఆఖరి రెండు రోజుల్లో చేసి చూపగల మేధావి,  పట్టుమని ఇరవైమంది చుట్టూ లేకపోయినా..2014 ఎన్నికలను అఖరివారంలో ఒంటి చేత్తో గెలిచిన అపర చాణక్యుడు..ఇవి బాబు గురించి ఉండవల్ల వంటి రాజకీయ భీష్ములు మరియు గ్రామ పంచాయతీ ఆఫీసులో కూర్చుని మాట్లాడుకునే పెద్ద మనుషులు చెప్పుకునే మాటలివి.


ప్రతి పక్ష వైసీపీ నేతలు చెప్పే మాటలు కూడా ఇవే..ఎన్నికల ముందు బాబు ఏదో ఒకటి చేసి ఎన్నికల సీన్ మార్చే అవకాశం ఉంది అని..అందరూ అనుకున్నట్లుగానే బాబు నాయకత్వంలో తెదేపా తన ఎన్నికల చివరి అంకాన్ని ఎన్నికలకు నాలుగు రోజుల ముందే మొదలు పెట్టేసిందా అని అనుకుంటున్నారు ఆంధ్రప్రజ.


ఇన్ కమ్ ట్యాక్స్ రైడులను నిరసిస్తూ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్డెక్కడం, ప్రత్యేక హోదా, నిధులు, కాల్ మనీ, రైతుల ఆత్మహత్యలు, అమరావతి - పోలవరం నిర్మాణం... వగైరా- వగైరా వంటి ఎన్నో అత్యంత ముఖ్యమయిన పనులకు రోడ్డెక్కని ముఖ్యమంత్రి... ప్రభుత్వంలో భాగమయిన ఆదాయపు పన్ను దాడులకు వ్యతిరేకంగా రోడ్డెక్కడం మమ్మల్ని విస్తుపరిచిందంటున్నారు ఆంధ్రప్రజ. 


రాష్ట్ర ముఖ్యమంత్రి, నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం, మూడు సార్లు ప్రభుత్వాన్ని నడిపినవారు, విధి - విధానాలు పక్కగా తెలిసిన వారు..ప్రజలతో మీకు ఇవ్వడానికి ఉంచిన డబ్బును ఐటి వాళ్ళు పట్టుకుంటున్నారు ఐనా నేను నా జుబులో డబ్బు కాదు, ప్రభుత్వ డబ్బునే మీ ఓటు కోసం వేల కోట్లనిచ్చానని చెప్పడం...ఈ ఎన్నికల చివరి అంకంలో మొదటి పుటలేనంటున్నారు ఆంధ్రప్రజ.


ఈ రోజు మొదలయిన శివాజీ ఎపిసోడ్... ఈ రెండు  మూడు రోజుల్లో తెదేపా సానుభూతి మీడియాలో హోరెత్తడం కూడా ఈ చివరి అంకంలో భాగమేనంటున్నారు ఆంధ్రప్రజ.


సిత్రాలు చూడరో గురుడా..శివమెత్తి పాడరో నరుడా..నరుడా అన్న మాదిరి.. రానున్న నాలుగు రోజలు గంటకో వార్త..రోజుకో సంచలనం అన్నట్టుగా ఆశ్చర్యపోనక్కరలేదు అంటున్నారు ఆంధ్రప్రజ.


ఏది ఏమయినా..నాయకులనుకుంటున్నట్టు మేమేమీ మర మంత్రాలం కాదు, మాకు మనస్సు, మంచి  చెడులు తెలుసుకునే విచక్షణ జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉన్నాయి.  ఓటనే ఆయుధానికి ఉన్న పవర్, దాన్ని ఉపయోగించుకునే విధానం మాకు తెలుసు, మేమేమి చేయాలో అది చేసి చూపిస్తాం తెలుగోడి సత్తా ఎలుగెత్తి ప్రపంచానికి చాటుతాం అంటున్నారు ఆంధ్రప్రజ..మీరేమంటారు?

మరింత సమాచారం తెలుసుకోండి: