ధనం మూలం ఇదం జగత్ అన్నాడొక తత్వవేత్త..ధనం మూలం ఇదం ఎన్నికలు అనాల్సొస్తుంది మనమంతా.. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న విధానం చూస్తే..ఎన్నికల గెలవడానికి కేవలం ధనం ఉంటే సరిపోతుందేమో అనేటటువంటి భయం కలుగుతుందంటున్నారు ఆంద్రప్రజ.


ఐటి రైడ్లు, పోలీసుల పుణ్యమా అని వేల కోట్ల రూపాయలు అక్రమ డబ్బులు పట్టుబడుతున్నాయి.  మద్యం, మాదక ద్రవ్యాలు వేల కోట్లలో పట్టుబడుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి కాన్వాయ్ లో ధనం కోట్లల్లో పట్టుబడుతుంది.  సాక్షాత్తు గవర్నర్లనే ప్రభుత్వం రీ-కాల్ చేస్తుంది. 


ఇదంతా ఒకలా ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరోలా ఉంది అంటున్నారు  పరిశీలకులు.  ఎన్నికలకు కొన్ని నెలల ముందే మొదలు పెట్టిన రైతులకు ధనం, కొన్ని వారాల ముందు ప్రవేశ పెట్టిన డ్వాక్రా ధనం..ఇలాంటివన్నీ ఇవ్వవలసినంత దుస్థితిలో ఆంధప్రజలున్నారు, నిజం మాట్లాడితే ఇంకా చాలా సహాయం చేస్తేనే తప్ప కోలుకోలేని స్థితిలో వారున్నారు.  


అయితే ఐదు ఏళ్ళు పాలించిన పాలకులు.. బిస్కట్ల మాదిరి ఎన్నికల ముందర ధన తాయిలం వాళ్ళ ముఖాన పడేసి వారి మెడలో పలుపు వేసి దొడ్లో కట్టేయ్యాలనుకోవడం మాత్రం క్షమించరాని నైతిక నేరమంటున్నారు ప్రజాస్వౌమ్యవాదులు.


సరే, ఏ ప్రభుత్వ ప్రాధాన్యతలా ప్రభుత్వానికుంటాయి.. అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత స్వయంగా డబ్బు ఇస్తున్నా, డబ్బు తెచ్చుకోండి మమ్మల్ని గెలిపించండి అని ఒకే వేదికపై మాట్లడే మాటలు మాత్రం మొత్తం ప్రజా స్వౌమ్యానికే ప్రమాదం, న్యాయ వ్యవకస్థలోని లోసుగులు ఎలా ఉన్నా నైతికత అనేది ఒకటుంటుంది..దానికి ఈ రోజు కాకపోతే రానున్న రోజుల్లో వారు, లేకపోతే వారి వారసులు, వారి పార్టీ తప్పని సరిగా సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు ప్రతిపక్ష నేతలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: