అవును.. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలో ఆ జిల్లా డిసైడ్ చేస్తుంది.. ఎందుకంటే.. రాష్ట్రంలోనే అత్యధికంగా అసెంబ్లీ సీట్లు ఉన్న జిల్లా అదే.. దాదాపు రెండు జిల్లాల్లో ఉన్నన్ని సీట్లు ఆ ఒక్క జిల్లాలోనే ఉన్నాయి. అంతే కాదు. అక్కడి ఓటరు తీర్పు కూడా చాలా భిన్నంగా ఉంటుంది. 


ఇంతకీ ఏ జిల్లా అంటారా.. అదే తూర్పు గోదావరి జిల్లా.. తూర్పు గోదావరి జిల్లా ఓటరు మిగిలిన జిల్లాలతో పోలిస్తే చాలా పరిపక్వతతో ఆలోచిస్తారు. ఇది చరిత్ర చాటిన నిజం. మూసపద్దతిలో ఓట్లు వేయడం.. డబ్బుకు అమ్ముడుపోవడం.. ఇక్కడ చాలా తక్కువ. కొత్తను ఆహ్వానించే జిల్లా కూడా. 

ఇక్కడ అసలు బీజేపీ అన్నది ఏపీలో ఎక్కడా లేని సమయంలోనే 1994లోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లా ఇది.  ఆ తరవాత ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులకు ఇక్కడి ఓటర్లు అవకాశం ఇచ్చారు. ఆ తరవాత ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడూ ఈ జిల్లాలో ఆదరించారు. 

ఈ జిల్లా ఓటరు.. స్థానిక ప్రయోజనాల కంటే.. రాష్ట్ర, దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ఓటు వేస్తుండటం విశేషం.. ఇక్కడి తీర్పులో ఎవరో చెప్పాలని ఓటేయడం.. ఉండదు.. ముందు చూపుతో కూడిన తీర్పు తూర్పుగోదావరి ఓటరు ప్రత్యేకత. ఇండిపెండెంట్లను కూడా గెలిపించి అసెంబ్లీకి పంపిన జిల్లా ఇది. మరి ఈసారి తూర్పుగోదావరి జిల్లా ఓటరు నిర్లయం ఎలా ఉంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: