టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ అరాచకాలు రోజుకొకటి వెలుగుచూస్తూ.. ఆయన పరువు మరింత దిగజారుస్తున్నాయి. అభిమానులపై ఆయన చేయి చేసుకోవడం.. బూతులు తిట్టడం  సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. 


తాజాగా బాలకృష్ణ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఓ అభిమానిని పరుగెత్తించి మరీ కుమ్మేశాడు.. సదరు అభిమాని బాలయ్యకు తగిలాడో.. పొరపాటున తాకాడో తెలియదు కానీ.. బాలయ్య మాత్రం అతడిని తిడుతూ..ఏకంగా మీదకు వెళ్లాడు. భయంతో ఆ అభిమాని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. 

కోపం వస్తే బాలయ్య వదలుతాడా.. పరుగెత్తించి మరీ కాలితో కుమ్మేశాడు. సాధారణంగా సినిమా ఫంక్షన్ల సమయంలోనూ.. అభిమానులతో ఉన్నప్పుడు బాలయ్య తిట్టడం, కొట్టడం చాలా కామన్.. ఫ్యాన్స్ కూడా దాన్ని ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ ఎన్నికల ప్రచారంలోనూ బాలయ్య ఏమాత్రం తగ్గడం లేదు. 

విజయనగరంలో జిల్లాలోనే మరో ఘటనలో తనను ఫోటో తీస్తున్న ఓ అభిమాని చేతి నుంచి సెల్ ఫోన్ లాక్కుని.. తనదైన స్టైల్లో నోటికి పని చెప్పాడు.. బాలయ్య తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధికి ఇంత అసహనం.. ఆగ్రహం పనికిరావన్న విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: