పోలింగ్‌కు ఇంకా రెండు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో టైమ్స్‌ నౌ సంస్థ తాజాగా తన సర్వే వివరాలు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో జగన్ సునామీ రానున్నట్టు తెలిపింది. వైసీపీ ఏకంగా పాతిక ఎంపీ స్థానాలకు ఇరవై గెలుచుకుంటుందని అంచనా వేసింది. 


ఇదే టైమ్స్ నౌ సర్వే.. వైఎస్‌ఆర్సీపీ 23 సీట్లను గెలుచుకుంటుందని జనవరి 31న వెల్లడించింది. అధికార టీడీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితం అవుతుందని జనవరి నాటి సర్వే పేర్కొంది. కాగా ఇప్పుడు ఓ మూడు ఎంపీ సీట్లు తగ్గించింది. 

మార్చి 22, ఏప్రిల్ 4 తేదీల మధ్య ఈ ఒపీనియర్ పోల్  తీసుకున్నారట. ఈ సర్వేలో వైసీపీకి 20, టీడీపీకి 5 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఒకసారి గత ఫలితాలను పోల్చిచూసుకుంటే... 2014లో టీడీపీ 15 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. వైసీపీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. 

ఇక జాతీయ పార్టీల విషయానికి వస్తే.. బీజేపీ, కాంగ్రెస్ రెంటింకీ ఒక్క సీటుకూడా వచ్చే ఛాన్స్ లేదట. 20 ఎంపీ సీట్లు లెక్క ప్రకారం.. అసెంబ్లీ ఫలితాలను అంచనా వేస్తే.. వైసీపీకి 130 కి పైగా అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. బహుశా ఇది చంద్రబాబు చరిత్రలోనే అతి పెద్ద ఓటమి అయ్యే అవకాశం ఉంది. అటు తెలంగాణలో టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 2, ఇతరులు ఒక చోట గెలుపొందుతారని టైమ్స్ నౌ సర్వే అంచనా వేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: