వై.ఎస్‌. జగన్.. ఎన్టీఆర్.. ఈ ఇద్దరు నేతలకూ కొన్ని సారూప్యతలు కనిపిస్తాయి. నమ్మిన విషయం కోసం ఎందాకైనా పోరాడే తత్వమే ఇద్దరిదీ.. ఆనాడు .. ఎన్టీఆర్‌ కేవలం ఓ ప్రాంతీయ పార్టీ అధినేతగానే ఉండి.. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీనే వణికించారని చెబుతుంటారు. 


వైఎస్‌ జగన్ కూడా అంతే.. ఓ ప్రాంతీయ పార్టీలో ఓ నేత అయి ఉండి.. అధిష్టానాన్ని ఎదిరించారు. సోనియా గాంధీ ఆజ్ఞలకు లొంగకుండా సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కీలక నేతగా ఎదిగారు. అంతే కాదు. వ్యక్తిగతంగానూ జగన్‌ ఎన్టీఆర్‌ ను అభిమానిస్తారు. 

ఇప్పుుడు ఎన్నికల ప్రచారంలోనూ జగన్‌.. ఎన్టీఆర్‌నే ఫాలో అవుతున్నారు. ఎన్టీఆర్‌కు తిరుపతి అంటే ఎనలేని సెంటిమెంట్.. తిరుమల శ్రీవారు అంటే ఎంతో భక్తి. అందుకే ఎన్నికల ప్రచారాన్ని ఆయన తిరుపతిలోనే ముగించేవారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్వస్థలానికి వెళ్లి అక్కడ ఓటు వేసేవారు. 

ఇప్పుడు జగన్ కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు కూడా ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం కూడా తిరుపతిలోనే ముగిస్తున్నారు. జగన్ తిరుపతి సందర్శన తర్వాత కడప జిల్లాకు వెళ్లి అక్కడ ఓటేస్తారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: