ఎన్నికల ప్రచారం ముగిసింది. అన్నిరకాల ఎత్తుగడలూ ముగిశాయి. ఇక మిగిలింది పోలింగ్.. ఆ మేరకు పార్టీలు తమ ప్రయత్నాల్లో మునుగుతూనే తమ పార్టీ ఏ స్థాయి విజయం సాధిస్తుందో అన్న లెక్కలు వేసుకుంటున్నారు. వైసీపీ నేతల వరకూ వస్తే.. వారు తమ పార్టీ 100 నుంచి 120 స్థానాల వరకూ గెలుస్తామని అంచనా వేసుకుంటున్నారు. 


గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఉత్తరాంధ్రలో తాము ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని ఆ పార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మెజారిటీ సీట్లు గెలుచుకుంటామంటున్నారు. విజయనగరం జిల్లాలో సగం గెలుచుకుంటామంటున్నారు. ఇక విశాఖ పట్నం కనీసం 7-8 స్థానాలు తాము గెలుచుకుంటామని చెబుతున్నారు. 

ఇక కోస్తా జిల్లాల విషయానికి వస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో యాభై నుంచి అరవైశాతం సీట్లు గెలుచుకంటారట. 8,9 సీట్లు వస్తాయట. పశ్చిమ గోదావరి జిల్లాలో 5 నుంచి 7 స్థానాలు వస్తాయని లెక్కేసుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ఈ సారి 8 నుంచి 10 స్థానాలు గెలుస్తామంటున్నారు. 

గుంటూరు జిల్లాలో 7-10 స్థానాలు గెలుస్తామంటున్నారు. ప్రకాశం , నెల్లూరు జిల్లాలో కలిపి.. 22 సీట్లు ఉంటే.. వైసీపీకి 11-12 వస్తాయని అంచనా వేసుకుంటున్నారు. రాయలసీమలోని 52 సీట్లలో కనీసం 30 - 32 సీట్లు గెలుచుకుంటాని ధీమాగా ఉన్నారు. 

కడపలో పదికి పది... కర్నూల్లో గతం కంటే ఎక్కువగా.. అనంతపురంలో ఆరు, ఏడు.. చిత్తూరు జిల్లాలోనూ ఆరు, ఏడు స్థానాలు గెలుచుకుంటామంటున్నారు వైసీపీ నేతలు. ఓవరాల్‌ గా చూసుకుంటే... 100-120 స్థానాలు గెలుచుకుంటామని లెక్కలు వేసకుంటున్నారు. ఇదీ వైసీపీ లెక్క..  



మరింత సమాచారం తెలుసుకోండి: