పోలింగ్‌కు ఇంకా 24 గంటలు ఉన్న సమయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలుగుదేశం ఎంపీ, గుంటూరు ఎంపీ అభ్యర్థి ఎంపీ గల్లా జయదేవ్ సిబ్బందిపై గుంటూరు లో దాడులు నిర్వహించారు. జయదేవ్ అకౌంటెంట్ వడ్లమూడి గుర్రపు నాయుడు ఇంట్లో సోదాలు నిర్వహించారు. 


మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి.  జయదేవ్ ఎన్నికల ఖర్చుల వివరాలను గుర్రప్ప నాయుడు రోజూ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందిస్తున్నప్పటికీ సోదాలు నిర్వహిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐతే.. గల్లా జయదేవ్‌ కోట్లకు పడగలెత్తిన పారిశ్రామిక వేత్త కావడం వల్ల.. ఎన్నికల్లో అపారంగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉండటంపై ఐటీ అధికారులు అతని సిబ్బంది చర్యలపై నిఘా పెట్టారు. గల్లా జయదేవ్ పైనే కాకుండా.. ఇలాంటి కోటీశ్వరుల కార్యకలాపాలపై ఐటీ, ఈడీ ఎన్నికల క్రతువు ఆరంభం నుంచే దృష్టి సారించాయి. 

గల్లా జయదేవ్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఖర్చులు ఈసీకి చూపించకపోవడం.. ఇబ్బడిముబ్బడిగా నగదుల లావాదేవీలు జరపడం కారణంగానే ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. టీడీపీ నేతలు మాత్రం కావాలనే తమను  నేతలను టార్గెట్ చేస్తున్నారని..ఆరోపిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: