ఒక మనిషి పలకరింపులోనే అతని ఆప్యాయత తెలిసిపోతుంది.. ఆ పిలుపు గుండెల్లో నుంచి వచ్చిందా.. గొంతులో నుంచి వచ్చిందా అన్నది విన్నవారు ఇట్టే పసగిట్టేస్తారు.. అందుకే.. కొందరి పలకరింపు.. అశేష జనవాహిని అమతపు పలుకులుగా మారతాయి. 


ఇలాంటి పిలుపు నాయకుడు నుంచి రావాలంటే.. ఆ నాయకుడికి స్వచ్ఛమైన మనస్సు ఉండాలి.. అంతా నావాళ్లు అనుకోగలిగేంత పెద్ద హృదయం ఉండాలి. ఊరికే అనుకుంటే సరిపోదు.. తన ఇంటివారిగా ప్రజలను భావించి సేవించే గుణం ఉండాలి. 

అలాంటి గుణాలన్నీ కలగలసిన వ్యక్తి కాబట్టేనేమో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పలకరింపు ప్రజలకు అంతగా నచ్చేది. ఆయన బహిరంగ సభల్లోనూ, రోడ్‌ షోల్లోనూ ఆ ప్రేమ జనంపై కనిపించేది. తాను చెప్పాల్సిన ప్రసంగం అంతా చెప్పేశాక ఆయన ఆ ప్రేమను బయటపెట్టేవారు.

సాధారణంగా సభల్లో అందరికీ నమస్కారం.. అంటూ బహువచనంలో చెప్పేస్తారు.. ఎందుకంటే అందరికీ పేరుపేరునా చెప్పడం కష్టం కాబట్టి.. కానీ వైఎస్సార్ అలా కాదు.. సాధ్యమైనంత వరకూ చెబుతా అన్నట్టు.. జనాన్ని నోరారా పలకరించేవారు..


ప్రసంగం చివర్లో అందరికీ వీడ్కోలు చెప్పేవారు. నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే అక్కయ్య, నమస్తే అన్నా.. నమస్తే .. నమస్తే.. నమస్తే.. అంటూ ఆప్యాయత కురిపించేవారు. అది ఓ జననాయకుడి వీడ్కోలు మరి. 



మరింత సమాచారం తెలుసుకోండి: