భారత దేశంలో వెయ్యి తూటాల కన్నా..ఒక్క ఓటు బలం ఎంతో అని అంటారు.  ఓటు ఒక రాజకీయ నాయకుడి దశ, దిశా నిర్ధేశిస్తుంది.  మనం మంచి నాయకుడిని ఎన్నుకుంటే దేశం పల్లె,పట్టణం,రాష్ట్రం,దేశం అభివృద్ది చెందుతుంది.  అలాంటి ఓటు ఐదేళ్లకు ఒక్కసారి వస్తుంది..అయితే ఈ మద్య కొన్ని టెక్నాలజీ ఇబ్బందుల వల్ల చాలా మంది ఓట్లు గల్లంతవుతున్నాయి. 


వాటిని సరిదిద్దుకోవడానికి కొంత మంది ప్రయత్నిస్తుంటే..కొంత మంది మాత్రం నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు.  అయితే  అన్ని ఫార్మాలిటీస్ సక్రమంగా పూర్తిచేసినా కొందరికి ఓటర్ ఐడీ జారీకాదు.  జారీ అయినా కొన్ని చేతికి అందకుండా మిస్సవుతుంటాయి.  ఓటర్ ఐడీ లేకపోతే ఓటు వేయలేమేమోనని చాలామంది కంగారుపడుతుంటారు.  


1.ఆధార్ కార్డ్

2. డ్రైవింగ్ లైసెన్స్ 

3.పాస్‌పోర్ట్ 

4. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, పిఎస్‌యులు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫోటో గల సర్వీసు గుర్తింపు కార్డులు

5.ఎన్‌పిఆర్‌ క్రింద ఆర్‌జిఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్ 

6.పాన్ కార్డు

7. కార్మిక మంత్రిత్వ శాఖ పథకం క్రింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్

8. ఎంఎన్ఆర్ఇజిఎ జాబ్ కార్డ్

9.  ఫోటో గల పింఛను పత్రం

10. ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్‌సిలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు

మరింత సమాచారం తెలుసుకోండి: