ఏపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో దాదాపు 17 లక్షల కోట్లు ఖర్చు చేసిందట. ఇలాంటి సమాచారంతో ఓ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మందిని ఆలోచింపజేస్తోంది. ఇంతకీ ఆ సందేశంలో ఏం ఉందంటే..


ఈ ఐదేళ్లలో కేంద్రం ఇచ్చింది పది లక్షల కోట్ల రూపాయలు.. ఐదేళ్లలో రాష్ట్ర ఆదాయం ఐదు లక్షల కోట్ల రూపాయలు..ఇక ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు రెండు లక్షల రూపాయలు.. వెరసి మొత్తం కలిపితే 17 లక్షల కోట్ల రూపాయలు.

ఈ మొత్తాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ పంచితే కనీసం మూడన్నర లక్షల రూపాయలు వస్తాయి. మరి అలాంటి పరిస్థితి ఏమీ కనిపించడం లేదు.. ఈ సొమ్ము మీకు అందిందా అంటూ ఆ పోస్టులో ప్రశ్నిస్తున్నారు. 

రాష్ట్రంలో రుణమాఫీ చేయలేదు,... నిరుద్యోగు భృతి ఇవ్వలేదు.. చివర్లో కాస్త విదిల్చారు లెండి. డ్రాక్వా రుణాలు మాఫీ చేయలేదు.. రాజధాని నిర్మించలేదు.. మరి ఈ డబ్బంతా ఎక్కడకిపోయింది.. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఇదీ ఆ సందేశం సారాంశం. మరి ఇందులో వాప్తవాలేంటో జనమే ఆలోచించుకోవాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: