ఎన్నికల వేళ మీడియా హౌజులు.. ఆయా రాజకీయ పార్టీల వర్క్ షాపుల్లా మారుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై దుష్ప్రచారానికి ఎంతకైనా తెగిస్తున్నాయి.. ఇటీవల జగన్కు సన్నిహితంగా ఉండే వైసీపీ మహిళా నేత ఒకరు.. తన అనుచరుడితో మాట్లాడినట్టు ఆడియో లీకైందంటూ ఎల్లో మీడియాగా పేరున్న ఓ ఛానల్, పత్రిక హడావిడి చేశాయి. 


ఆ సంభాషణను నిశితంగా గమనిస్తే.. అది ఫేక్ అని..క్రియేట్ చేసిందేమో అనిపించకమానదు.. ఏ నేత అయినా.. తమ ప్లాన్ల గురించి అంత బహిరంగంగా మాట్లాడుకుంటారా.. పదే పదే తమ ప్లాన్.. తమ ప్లాన్ అంటూ మాట్లాడుకోవడం.. చూస్తే అది రికార్డు చేసిన ఆడియోలానే అనిపిస్తోంది. 

ఒకవేళ నిజమైందే అయితే అది ఎలా బయటకు వచ్చింది.. పోలీసులేమైనా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారా.. మరి ఇన్ని బయటపెట్టినవారు.. ఆ నేతలెవరో ఎందుకు బయటపెట్టరు.. ఇంకా విచిత్రం ఏంటంటే.. ఆ.. రాష్ట్రంలోని ఎస్పీలందరూ మనం చెప్పినట్టే వింటున్నారు.. అంటోంది ఆ మహిళా నేత.

అసలు అలాంటి పరిస్థితి ఉంటుందా.. ఎస్పీలు అధికార పార్టీ మాట వింటారా..ప్రతిపక్షం మాట వింటారా.. సో.. ఇవన్నీ చూస్తే అది కావాలని రికార్డు చేయించిందన్న విషయం కాస్త పరిశీలన., ఆలోచన ఉన్న వారెవరైనా ఇట్టే చెప్పేస్తారు.. పోలింగ్ పూర్తయ్యే వరకూ ఇలాంటి విచిత్రాలు చూస్తూ ఉండాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: