ఆంధ్రప్రజలు ఎంతో ఆసక్తిగా  ఎదురు చూసిన 2019 ఎన్నికల పోలింగ్ రోజు రానే వచ్చింది.  అందరూ ఊమించనట్లుగానే ఆంధ్రప్రజ ఎన్నికల్లో ఓటెయ్యడా నికి పోటెత్తారు.


దాదాపు 50 వేల ఈవీఎం మెషిన్లను ముప్పవేల పోలింగ్ బూతులు, వెల సిబ్బంది, వంద సాంకేతి, నిపుణులతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ పోలింగ్ ప్రక్రియ సాఫిగా జరిగే విధంగా కృషి చేస్తుంది.


చారాణా ముర్గీకా బారానా మసాలా అంటే పావలా కోడికి ముప్పావల మసాలా అన్నట్లుండే మీడియా అందులోనూ  తెదేపా సానుభూతి మీడియా ప్రొద్దున్నుండి ఒకటే గొడవ ఈవీఎంలు పనిచేయట్లేదని, ప్రజలు ఎన్నికల కమిషన్ పై ఆగ్రహంగా ఉన్నారని, పార్టీలు ఎన్నికల కమిషన్ తీరును గర్హెస్తున్నాయని..


మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి మాత్రం 50 వేల ఈ వీఎంలకు 300 ఈవీఎంలలో చిన్న ఇబ్బందులుంటే వాటిని వెంటనే తొలగించామని, 50 ఈవీఎంలను మార్చామని.. ఎన్నికల్లో పోలింగ్ బ్రహ్మాండంగా ఉందని, పోలింగ్ శాతం గతంలో కంటే పెరుగుతుందని అధికారికంగా చెప్పేశారట?
ఈవీఎంలు పనిచేయకపోతే పోలింగ్ శాతం ఎట్టా పెరుగుతుంది బుజ్జి అని నవ్వుతూ చమత్కరిస్తున్నారు ఆంధ్రప్రజ. చూడాలి సాయంత్రానికి పోలింగ్ శాతం ఎంత వస్తుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: