తెలుగుదేశం పార్టీ, సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ పార్టీ ప్రకటనల ద్వారా సంపద పోగేసుకోవటం మరియు ఇతర రాజకీయ వ్యాపారాలు, ఈ ఐదే పంచ ప్రాణాలుగా ఆంధ్ర జ్యోతి జీవిస్తుంది. ఇప్పుడు దానికి ఏపిలో చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ  అధికారంలోకి రావాలి, లేక పోతే దాని పంచ ప్రాణాలు అనంత వాయువుల్లోకి కలిసిపోయేటంత ప్రమాదాన్ని ఊహిస్తుంది. అందుకే దాని పక్షపాతాన్ని ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే రూపంలో ప్రచురించి తెలంగాణాలో పరువు ప్రతిష్టలను భూస్తాపితం చేసుకుంది. మళ్ళా ఏపిలో ఆ విఫల ప్రయోగాన్ని ఆచరించింది. దాని ఫలితంగా ఇప్పుడు ఇబ్బందుల్లో చిక్కుకుంది.    
Image result for andhra jyothi Vs Ycp
ప్రభుభక్తి, కులభక్తి తనువంతా ఆవహించిన పచ్చజ్యోతి అదే ఆంధ్రజ్యోతి దినపత్రికకు  "భారత ప్రెస్‌ కౌన్సిల్‌  పీసీఐ,  షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సంస్థలు నిర్వహించినట్టుగా పేర్కొన్న సర్వేలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రాబోతోందంటూ బోగస్‌ న్యూస్ ప్రచురించిన నేరానికి - ఫేక్‌ న్యూస్‌ ప్రచురణపై 15రోజుల్లో లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 
Image result for complaint on ABN to press council of india
బుధవారం పీసీఐ కార్యదర్శి అనుపమ భట్నాగర్‌ షోకాజ్‌ నోటీసును ఆంధ్రజ్యోతి ప్రధాన సంపాదకులకు పంపించారు. ఈ వార్తకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఈ నోటీసును జారీ చేసినట్టు తెలిపారు. నోటీసు పంపిన తేదీ నుంచి నిర్ణీత 15 రోజుల గడువు లోగా ఆ పత్రిక నుంచి స్పందన రాకపోతే తగిన చర్యలు తీసుకునేందుకు ఈ బోగస్ వార్త ప్రచురించిన నేరాభియోగ అంశాన్ని ప్రెస్‌ కౌన్సిల్‌ విచారణ కమిటీ ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. 
Related image
"లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సంస్థ" లు నిర్వహించినట్టుగా పేర్కొన్న ఈ బోగస్‌ సర్వేలో టీడీపీ 126–135 ఎమ్మెల్యే స్థానాలు, 18–22 ఎంపీ సీట్లను గెలుచుకోబోతోందని ఆంధ్రజ్యోతి దినపత్రికలో (02.04.2019) ప్రచురితమైన విషయం విదితమే. అయితే తాము ఆంధ్రజ్యోతి లో ప్రచురించినట్లు ఎలాంటి సర్వే నిర్వహించలేదని, తమ సంస్థ పేరును ఫేక్ సర్వే తో దుర్వినియోగం చేసిన నేరానికి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సంస్థ హెచ్చరించింది. 
Image result for lokniti csds

Related image

అప్పుడే లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సంస్థ ఈ వార్తతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేసింది. ఈ బోగస్‌ సర్వే వార్తపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రెస్‌ కౌన్సిల్‌ ఇండియా కు సైతం పలువురు ఫిర్యాదు చేశారు. బోగస్‌ సర్వేలతో వార్తలు ప్రచురించడాన్ని తాను "పెయిడ్‌ న్యూస్‌" గా అనుమానిస్తున్నట్టు, ఈ వార్త ప్రచురణకు గాను ఆంధ్రజ్యోతి పత్రిక పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ జస్టిస్‌ సీకే ప్రసాద్‌కు, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ అరోరా కు సీనియర్‌ జర్నలిస్టు, భారత ప్రెస్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యుడు కె.అమర్‌నాథ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Image result for lokniti csds
ఫిర్యాదుతోపాటు ఆంధ్రజ్యోతి బోగస్‌ సర్వే వార్త, దాని ఇంగ్లిష్‌ అనువాదం, లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సంస్థ ఖండన ఇతర వివరాలను కూడా జతచేశారు. ప్రత్యేకంగా ఒక పార్టీకి అనుకూలం గా ఓటర్లను ప్రభావితం చేసేలా వార్తను ప్రచురించడం మీడియా సంస్థలకుజ్ సరికాదని ఈ విషయంలో ఆంధ్రజ్యోతి పత్రికపై న్యాయపరంగా చర్య తీసుకోవాలని కోరారు. ఇలాంటి వార్తలు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగకుండా ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వెంటనే చర్యలు తీసుకోవా లని అమర్‌ నాథ్‌ విజ్ఞప్తి చేశారు.


మరో తప్పుడు సర్వే

ఆంధ్రప్రదేశ్‌ లో మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వచ్చే అవకాశముందని కార్పొరేట్‌ చాణక్య పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రిక సోమవారం ఓ దొంగ సర్వేను ప్రచురించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రజలు ఈ సారి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని తెలిసిపోయిన చంద్రబాబు ఈ తోకపత్రిక సాయంతో సర్వే డ్రామాలకు తెరతీశాడు. దాంతో ప్రముఖ సర్వే సంస్థ మిషన్‌ చాణక్య పేరును పోలి ఉండేవిధంగా ‘కార్పొరేట్‌ చాణక్య’  అనే ఫేక్‌ సర్వే సంస్థ పుట్టుకొచ్చింది. ఏకంగా టీడీపీకీ 101 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్పుకొచ్చింది. ఇక తమ పేరును బద్నాం చేసిన ఆంధ్రజ్యోతి పత్రికపై మిషన్‌ చాణక్య మండి పడింది. దొంగ సర్వేలను ప్రచురించమే కాకుండా.. తమ ట్రాక్‌ రికార్డును సైతం కాపీ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రజ్యోతి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందని వెల్లడించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది.

Image result for mission chanakya logo

టీడీపీకి 101 సీట్లు అంటూ సర్వే పేరుతో సోమవారం నాటి ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన కథనంలో.. మా సంస్థ ‘మిషన్‌ చాణక్య’ పేరును దుర్వినియోగం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా సంస్థకున్న ప్రతిష్టను దిగజార్చేలా .. కార్పొరేట్‌ చాణక్య అనే మారుపేరును సృష్టించడం అభ్యంతరకరం. మిషన్‌ చాణక్యకున్న ట్రాక్‌ రికార్డును.. కొర్పొరేట్‌ చాణక్య అనే లేని సంస్థకు (it is a name of a management book) ఆపాదించడం ప్రజలను తప్పుదారి పట్టించడమే అవుతుంది.

Image result for corporate chanakya book

ఆంధ్రజ్యోతి పత్రికలో ఎవరీ చాణక్య అంటూ ప్రచురించిన ట్రాక్‌ రికార్డు వాస్తవానికి మిషన్‌ చాణక్య దని స్పష్టం చేస్తున్నాం. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న మా సంస్థకు దక్షిణాది రాష్ట్రాల్లో నెట్‌ వర్క్‌ ఉంది. కర్ణాటకలో బీజేపీ సీట్లను ఖచ్చింతంగా అంచనా వేసిందీ. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కు వచ్చే సీట్లను ఖచ్చితం గా అంచనా వేసింది కూడా మిషన్‌ చాణక్య  మాత్రమే  కార్పొరేట్‌ చాణక్య కాదు అని మరోసారి స్పష్టం చేస్తున్నాం.

ఈ విధంగా ప్రఖ్యాత సంస్థల సర్వేలుగా ఎవరూ చేయని సర్వేలను తెలుగుదేశం పార్టీకి ప్రయోజనకరంగా సృష్టించి ప్రచురించటం ఆంధ్రజ్యోతి అనే పచ్చ దిన పత్రికకు ఏబిఎన్ అనే పచ్చ చానల్ కు అలవాతై పోయింది. తద్వారా ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో ఈ పత్రికను చానలను ఒక కులానికి ఒక పార్టీకి ఒక ప్రాంతానికి చెందిన కరపత్రంగా ప్రచారంలోకి వచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: