ప్రముఖ నటుడు, సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక రోల్‌ పోషించిన శివాజీ ఇటీవల కాలంలో మీడియాలో ప్రము ఖంగా కనిపిస్తున్నారు. ఆయన మాటలు వినిపిస్తున్నాయి. ఏపీకి అన్యాయం జరిగిందంటూ.. ప్రారంభించిన ఆయన వ్యాఖ్యానం ఇప్పుడు టీడీపీకి అన్యాయం జరిగిందని, ప్రజలంతా కాపాడాలనే వరకు వెళ్లింది. అంతా బాగానే ఉంది. అయితే. తాను అన్నింటికీ అతీతమైన వ్యక్తినని చెబుతూనే కుల పిచ్చితో వ్యవహరిస్తారనే పేరు తెచ్చుకున్నారు. శివాజీ పేరు కాస్తా కులాజీగా మారిపోయింది. ఈ విషయంపై సోసల్‌మీడియా ఇప్పటికే శివాజీని ఏకేస్తోంది. ఆయన శివాజీ కాదు.. కులాజీ.. అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అదేసమయంలో ఆపరేషన్‌ గరుడ అంటూ.. అతి పెద్ద గరుడ పురాణం వండి వార్చారని కూడా పెద్ద ఎత్తున వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 


ఇక, ఎక్కడైనా ఏ ప్రజాస్వామిక వాదైనా.. ప్రభుత్వ లోపాలను, ప్రతిపక్షం చేస్తున్న వ్యవహారాలను కూడా విమ ర్శించడం ఎక్కడా తప్పుకాదు. ఈ క్రమంలోనే గత ఏడాది కాలంగా రాజకీయాలపై తీవ్రస్థాయిలో పదునైన వ్యా ఖ్యలు చేస్తున్న శివాజీ .. తరచుగా టీడీపీకి అండగా నిలుస్తున్నారు. ఒకప్పుడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొం టే.. తాను చంద్రబాబు ఇంటి ముందు శవం అయి కూర్చుంటానని శపథం చేసిన శివాజీ.. తీరా చంద్రబాబు ప్యాకేజీని పట్టుకునిఏపీకి వచ్చిన సమయంలో అమెరికాకు చెక్కేసి.. తన ఉత్తర కుమార ప్రగల్భాలాను శివాజీ నిరూపించుకున్నాడనే వ్యాఖ్యలు తరచుగా వినిపిస్తున్నాయి. 


ఇక, ఇటీవల కాలంలో టీడీపీకి కొమ్ముకాస్తూ.. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీపై దుమ్మెత్తి పోస్తున్నాడు శివాజీ. ప్రతి విషయంలోనూ మీడియా ముందుకు రావడం, మోడీతో వైసీపీ స్నేహం చేస్తోందని, కేసీఆర్‌తో స్నేహం చేస్తోందని, ఏపీకి నష్టమని మొసలి కన్నీరు కారుస్తూ.. టీడీపీకి ఓటేయాలని పరోక్ష సంకేతాలు ఇస్తు న్నారు. వాస్తవానికి ఇలాంటి ప్రచారం స్వచ్ఛందంగా చేస్తున్నాడని శివాజీపై చాలా మంది అనుకున్నారు. అయితే, తాజాగా టీడీపీనేతల మధ్య జరిగిన ఆడియో సంభాషణ వెలుగు చూడడంతో ఒక్కసారిగా సీన్‌ రివర్స్‌ అయింది. దాదాపు 10 కోట్ల మొత్తానికి శివాజీ అమ్ముడుపోయాడంటూ.. ఈ ఆడియో సంభాషణలో వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిపై శివాజీ ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి. ఏదేమైనా.. ఇప్పుడున్న వాతావరణంలో సినిమాల కన్నా ఇలాంటి ప్యాకేజీలైతేనే బాగుంటుందని శివాజీ భావిస్తున్నట్టు చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: