ఎందుకో ఏమో జనసేన మాత్రం ఎన్నికలకు వారం రోజుల నుంచి బాగా వీక్ అయ్యిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీ పెట్టిన మొదట్లో.. ఆ తర్వాత పవన్ కల్యాణ ఓ 20-30 సీట్లు గెలుస్తాడని అంతా ఊహించారు. కానీ ఆ తర్వాత ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. 


ఇప్పుడు ఎన్నికలైపోయాక.. జనసేన నుంచి గెలిచేదెవరని లెక్కలు వేసుకుంటే.. రెండు పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారు ఆపార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌.. ఇంకొకరు విశాఖలో ఎంపీ జేడీ లక్ష్మీనారాయణ. పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకల్లో ఎక్కడో ఒక చోట గెలవచ్చని తెలుస్తోంది. 

గాజువాకలో గెలుపు ఖాయం అన్న విశ్లేషణ ఉంది. మరోవైపు విశాఖపట్నం నుంచి లోక్ సభకు పోటీచేసిన మాజీ పోలీస్ అదికారి లక్ష్మీనారాయణకు పరిస్థితి సానుకూలంగా ఉండవచ్చని తెలుస్తోంది. అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉన్నా, లక్ష్మీనారాయణకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. టీడీపీ, వైసీపీ నుంచి పార్టీల నుంచి క్రాస్‌ ఓటింగ్‌ భారీగానే జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. 

అంటే జనసేన నుంచి ఆ పార్టీ తరపున అసెంబ్లీకి పవన్ కల్యాణ్... పార్లమెంటుకు జేడీ లక్ష్మీనారాయణ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరితో జనసేన ప్రస్థానం ముందుకు సాగుతుందా.. ఏ మలుపులు తీసుకుంటుందన్నది ఆసక్తికరం. చూడాలి మరి జనసేనాని ఎలా రాజకీయం ముందుకు నడిపిస్తాడో.?



మరింత సమాచారం తెలుసుకోండి: