ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరగడంతో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ ఎవరికి వారు అధికారం తమదే అంటే తమదే అని ధీమాతో ఉన్నాయి. ఓటింగ్‌ శాతం పెరగడం తమకే అనుకూలమని, ఇది ప్రభుత్వ వ్యతిరేఖ ఓటుకు సంకేతమని వైసీపీ అంటే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పాజిటివ్‌ ఓటే దీనికి కారణమని టీడీపీ అంటోంది. ఇక గురువారం అర్థరాత్రి టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు ఏపీలో మరో సారి మనం అధికారంలోకి రాబోతున్నాం.. టీడీపీ 130 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని చెప్పారు. గురువారం ఉదయం 4 గంటల నుంచి చంద్రబాబు పార్టీ నేతలతో 8 నుంచి 10 సార్లు వరకు పదే పదే టెలీ కాన్ఫరెన్సులు నిర్వహిస్తూనే ఉన్నారు. 


ఇక మొత్తం 175 సీట్లకు 130 సీట్లకు మనకు తగ్గవని చెబుతున్న చంద్రబాబుకు వాస్తవ పరిస్థితి ఏంటంన్నది స్పష్టంగా తెలుసు. చంద్రబాబు చేసిన ఈ ప్రకటనలో ఆత్మవిశ్వాసం కంటే అతివిశ్వాసమే ఎక్కువగా కనపడుతోందన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరులోనే వైసీపీతో పోల్చుకుంటే ఎక్కువ సీట్లు సాధించుకోలేని పరిస్థితి. గత రెండు దశాబ్దాలుగా ఇప్పటికీ తన సొంత జిల్లాలో ప్రత్యర్థి పార్టీపై పైచేయి సాధించలేని చంద్రబాబు ఇప్పుడు పోలింగ్‌ సరళి అధికార పార్టీకి వ్యతిరేఖంగా ఉన్నట్టు కనిపిస్తున్నా 130 సీట్లు వస్తాయని ప్రగల్భాలు పలకడం విచిత్రం కాక మరేంటి అవుతుంది. 


అటు జగన్‌ సొంత జిల్లాలో ఎలాగో టీడీపీ ఖాతా తెరిస్తేనే గొప్ప అన్నట్లుగా ఉంది. ఇటు తన సొంత జిల్లాలోనూ  వైసీపీకి కంటే ఎక్కువ సీట్లు రావు. తన ప్రాంతమైన రాయలసీమలోనూ అదే పరిస్థితి. ఇటు కృష్ణా, గుంటూరు మినహా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో టీడీపీ గ్రాఫ్‌ గత ఎన్నికలతో పోలిస్తే చాలా డౌన్‌ అయినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ వర్గాలే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో తమ గ్రాఫ్‌ చాలా పడిపోయిందని ఒప్పుకుంటున్నాయి. మరి ఈ టైమ్‌లో టీడీపీకి ఎక్కడ నుంచి 130 సీట్లు వస్తాయో చంద్రబాబు విడమర్చి చెబితే బాగుండేదేమో. మరి బాబోరి మాటలు ఎన్నికల ఫలితాల వరకు ఇలాగే కొనసాగేలా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: