తెలుగు దేశం పార్టీ.. దాదాపు నలబై సంవత్సరాల చరిత్ర.. పటిష్ఠమయిన పార్టీ నిర్మాణం, అనేక ఒడిదుడుకులు, వత్తిడులను తట్టుకొని డజన్ల ఎన్నికలు ఎదుర్కొన్న రాజకీయ పార్టీ.. దానికి తోడు ఘటనా-ఘటన సమర్థులయిన నాయకులు, బూత్ స్థాయి నుంచి ప్రపంచ  స్థాయిలో కార్యకర్తలు, వీరాభిమానులు హంగు, ఆర్భాటం, నిధులు, ఇన్ ఫ్లూ మెన్స్, వగైరా..వగైరా..


జనసేన పార్టీ...అకాశమంత విశ్వాసం - గోరంత నిధులు, అనంతమయిన మంచి చేయాలనే తపన-పిడికెడు  వనరులు.. సర్వం తానే అయిన నడిపిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్.


ఈ రెండు పార్టీలకు వాటి-వాటి బలా-బలాలు, ఆస్తులు, పార్టీ నిర్మాణాలు చూస్తే ఆకాశం-పాతాళానికి ఉన్న వ్యత్యాసం.  అయితే ఆశ్చర్యంగా తెలుగుదేశం పార్టీ కంటే జనసేన పార్టీనే 100 రెట్లు నయమంటున్నారు ఆంధ్రప్రజ, తెలుగు జనం. 


ఎందుకంటే..ఎన్నికల ప్రచార సరళి, ఎన్నికల నియమావళినే కాకుండా నైతికంగా తమకు తామే విధించుకున్న సాంప్రదాయాలు, అన్నింటికన్నా ముఖ్యంగా ఎన్నికల రోజు జనసేన పార్టీ ముఖ్య నాయకులు, అధినేత పవన్ కళ్యాన్ గారు కనబరచిన ప్రజాస్వౌమ్య వాదం. 


తమ పార్టీ అభ్యర్థి ఈవిఎం పగుల గొట్టాడనే వార్త... కప్పిపుచ్చే దోరణి, ఆక్-పాక్-కరేపాక్ చేయకుండా సూటిగా..తప్పు జరిగింది. ఎందుకలా చేశారో తెలుసుకంటానంటూ ట్రూ స్టేట్స్ మెన్ లా మాట్లాడిన విధానం, ఇంకా మరెన్నో తెదేపా కంటే జనసేన 100 రెట్లు బెటర్ అన్పించేలా చేస్తున్నాయి అంటున్నారు ఆంధ్రప్రజ, తెలుగు జనం.


మరింత సమాచారం తెలుసుకోండి: