ఎన్నికల ముందు పార్టీల్లోకి వలసలు మామూలే..  ఆ పార్టీలో టికెట్ రాక పోతే.. ఈ పార్టీ.. ఈ పార్టీ టికెట్‌ రాకపోతే.. ఆ పార్టీ..ఇలా మారుతూనే ఉంటారు. సినీ స్టార్లు కూడా అంతే.. ఎన్నికల సీజన్లో చేరికలతో హడావిడి చేస్తుంటారు. 


కానీ విచిత్రంగా కడప జిల్లాలో ఎన్నికల తర్వాత వైసీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. వైయస్‌ఆర్‌ జిల్లాలో తెలుగు దేశం పార్టీకి షాక్‌ తగిలింది. పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజే ఆ పార్టీ కీలక నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో చేరారు.  ఈ మేరకు శుక్రవారం వైయస్‌ఆర్‌సీపీ నేత, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సమక్షంలో వీరశివారెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. 

మరి పోలింగ్ ముగిశాక.. ఇప్పుడు ఎందుకు చేరుతున్నారని అడిగితే.. త్వరలో రాజన్న రాజ్యం రాబోతుందని, రాష్ట్రానికి మంచి జరుగుతుందని శివారెడ్డి చెబుతున్నారు. మరి శివారెడ్డికి జగన్ గెలవబోతున్నాడని ముందే తెలిసిపోయిందా.. శివారెడ్డి అంచనా నిజమే అవుతుందా...? 

వాస్తవానికి వీర శివారెడ్డి ముందు నుంచి టీడీపీలో అసంతృప్తితోనే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లోనూ టికెట్ల కేటాయింపుపై ఆయన మాట చెల్లుబాటు కాలేదు. అప్పుడే పార్టీలో మారాలని అనుకున్నా.. ఎన్నికల ముందు మారితే.. సీటు కోసం అంటారని ఆగారట. మొత్తానికి ఇప్పుడు జగన్ గెలుపుపై నమ్మకం కలగడంతో వైసీపీలోకి వచ్చేసినట్టున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: