తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికలసంఘం సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు  జిల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు జరపాలనే ఆలోచనతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరింది. మార్చి 13, 22 తేదీల్లో రెండుసార్లు లేఖలు రాసింది.


వాటిని పరిశీలించిన ఈసీ స్థానిక ఎన్నికలకు ఆమోదం తెలిసింది.  32 జిల్లాలకు చెందిన 535 జడ్పీటీసీ, 5857 ఎంపీటీసీ స్థానాలకు చెందిన రిజర్వేషన్లు ఇప్పటికే ప్రకటించింది. మే నెలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.  లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన తేలనున్నాయి. లోక్‌సభ ఫలితాల తరువాతనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: