రాజకీయ చైతన్యం ఉన్న కర్నూలు జిల్లా తరచుగా వార్తల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఏదో ఒక వివాదమో, రాజకీయ సమీకర ణమో ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ వైసీపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో 11 స్థానాలకు కూడా ఇక్కడ కైవ సం చేసుకున్న వైసీపీ.. ఇప్పుడు కూడా అదే హవాను కొనసాగిస్తుందా?  ఇక, టీడీపీ పుంజుకుని తన సత్తాను చాటుతుందా? అనే ప్రశ్నలు తెరమీదికి వచ్చారు. ఈ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను కూడా గత ఎన్నికల్లో వైసీపీ కైవసం చేసుకుంది. ఇక, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. ఎన్నికలు ముగిసి మూడు రోజులు పూర్తయ్యాయి. ఇప్పటికే ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం అయిపోయింది. ఈ నేపథ్యంలో కర్నూలు తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉంది? అనేది ప్రధాన చర్చగా మారింది. 


కొన్ని నియోజకవర్గాల్లో గతంలో వైసీపీ తరఫున పోటీ చేసిన నాయకులు ఈ దఫా టీడీపీ నుంచి పోటీ చేయడం గమనార్హం. ప్రధానంగా మంత్రి అఖిల ప్రియ పోటీ చేస్తున్న ఆళ్ళగడ్డ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. ఎస్సీ, మైనార్టీల ఓటు బ్యాంకు వైసీపీ పూర్తిగా అండగా ఉండడం ఇక్కడ కలిసి వస్తున్న ప్రధాన అంశం. ప్రభుత్వంపై ఉన్న వ్యతి రేకత కూడా వైసీపీకి కలిసివస్తోంది. నంద్యాలలో భూమా వర్గం గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసింది ఇప్పుడు టీడీపీకి పనిచేయాల్సి వచ్చింది. అయితే, వీరిలో చాలా మంది చీలిపోయారనేది వాస్తవం. వీరి ఓట్లు తిరిగి వైసీపీకే పడ్డాయని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంలో భూమా కుటుంబం ముఖ్యంగా మంత్రి అఖిల ప్రియ విఫలమయ్యారు. 

Image result for kurnool district

ఇక, మంత్రిగా కూడా అఖిల ప్రియ విఫలమయ్యారనే పేరు తెచ్చుకున్నారు. ప్రతి చిన్న విషయంలోనూ ఘర్షణలకు దిగడం, సొంత పార్టీ వారినే దూరం చేసుకోవడం, ఇక, కర్నూలు నుంచి వైసీపీ టికెట్‌పై గెలిచి టీడీపీలో చేరి ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో టికెట్‌ కోల్పోయిన ఎస్వీ మోహన్‌ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరడం, టీడీపీకి యాంటీగా మారడం, అదేవిధంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా తిరిగి సొంత గూటికి చేరడం వంటి పరిణామాలు వైసీపీకి అనుకూలంగా మారితే.. శ్రీశైలం నుంచి గెలుపొంది.. తర్వాత టీడీపీలో చేరిన బుడ్డా రాజశేఖర్‌ చివరి వరకు చేసిన కుటుంబ రాజకీయం.. ఆయన కు మైనస్‌గా మారిపోయింది. అదేసమయంలో ప్రజల్లో బలమైన ముద్ర వేసుకున్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టికెట్‌ ఇవ్వలేదనే అలకతో.. టీడీపీ నుంచి జనసేనలోకి జంప్‌ చేసి .. మొత్తంగా మూడు టికెట్లు సంపాయించుకుని పోటీ దిగడం కూడా టీడీపీ ఓట్లను చీలుస్తుందనడంలో సందేహం లేదు. 


జిల్లాలోని 14 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్ల‌కు గాను 2 ఎంపీ సీట్లూ వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. ఇక ఏకంగా 11 అసెంబ్లీ సీట్ల‌ను వైసీపీ వ‌న్‌సైడ్‌గా క్లీన్‌స్వీప్ చేస్తుంద‌ని తేలిపోయింది. టీడీపీ మూడు సీట్ల‌తో స‌రిపెట్టుకోనుంది. ఆళ్ల‌గ‌డ్డ‌, శ్రీశైలం, నందికొట్కూరు, క‌ర్నూలు టైట్ ఫైట్‌లో వైసీపీ గెలుస్తుందంటున్నారు. పాణ్యం, నంద్యాల‌, బ‌న‌గాన‌ప‌ల్లె, డోన్‌, ప‌త్తికొండ, మంత్రాల‌యం, ఆదోనీ కూడా వైసీపీ ఖాతాలోకే వెళ్ల‌నున్నాయి. ఇక టీడీపీ ఎమ్మిగ‌నూరు, కోడూరు, ఆలూరులో గెలిచే ఛాన్స్ ఉందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: