ప్రజాస్వామ్యాన్ని బతికిస్తోంది పల్లెలే అన్నది ఎప్పటి నుంచో ఉంది. సమాజం పట్ల, మనం ఎన్నుకునే ప్రభ్తుత్వం పట్ల ఎంతో బాధ్యతతో వాళ్లు ఎప్పుడూ తమ ఓటును వేస్తారు. మనం ఓటు హక్కు వినియోగించుకోకపోతే అసలు మనం బతికిలేనట్టే లెక్క అన్నది పల్లె వాసుల నానుడి. దేశం పట్ల ఎప్పుడూ తమ బాధ్యతను నెరవేర్చే విషయంలో వారు పట్టన వాసులు, ఉన్నత విద్యావంతుల కంటే ఎంతో ముందు ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిని తాజా ఎన్నికల్లో మరో సారి ఈ విషయం స్పష్టం అయ్యింది. ఏపీలో పోలింగ్‌ 80 శాతం వరకు జరిగిందంటే అందుకు పల్లెటూర్లలో భారీగా జరిగిన పోలింగే ప్రధాన కారణం. కొన్ని కొన్ని పల్లెల్లో 90 నుంచి 95 శాతం ఇంకా కొన్ని చోట్ల 96 శాతం పోలింగ్‌ కూడా జరిగింది. పట్టణ‌ వాసులు ఎన్నికలను ఏ మాత్రం పట్టించుకోకుండా మరో సారి ప్రజాస్వామ్యం పట్ల తమ బద్దకాన్ని బయట పెట్టుకున్నారు. 


ఉన్నత విద్యావంతులు కాకపోయినా, పట్టణాల్లో ఉన్న వాళ్లంతా లగ్జరీ లైఫ్‌ వాళ్లకు లేకపోయినా వాళ్లకు మాత్రం మ‌న దేశ భవిష్యత్తు పట్ల స్పష్టమైన ముందు చూపు ఉందన్నది తెలుస్తోంది. పట్టణ‌ ప్రాంతాల్లో కొంత మంది వేరే చోట్లకు వలస వెళ్లడం లాంటి కారణాలు కొన్ని అయితే.. మరి కొందరు అసలు ఎన్నికలు ఉన్న విషయాన్నే మరచిపోయినట్టు ఉన్నారు. ఇక మెట్రో ప్రాంతాల్లో మాత్రం చాలా ఘోరంగా పోలింగ్‌ జరిగింది. అసలు పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియని విధంగా మెట్రో నగరాల్లో ప్రజల లైఫ్‌ స్టైల్‌ ఉంది. ఇలాంటప్పుడు ఎన్నికలు జరుగుతుందన్న విషయం మాత్రం వారికి తెలుసని ఆశించడం అత్యాసే. ఎవరు గెలిస్తే నాకేంటి ?ఎవరు వచ్చినా నేను మేనేజ్‌ చేసుకుంటానన్న అహంభావం ఈ ఉన్నత వర్గాల్లో కొంత మందిలో సహజంగానే ఉంటుంది. ఇందుకు ఉదాహరణ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో జరిగిన పోలింగ్‌ శాతమే ఉదాహరణ. 

Image result for democracy india

సికింద్రాబాద్‌ పోలింగ్‌ 49 శాతానికి పరిమితం అయితే... హైదరాబాద్‌లో కేవలం 39 శాతం మాత్రమే పోలింగ్‌ జరిగింది. హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో చూస్తే మొత్తం 100 మందిలో 61 మంది ఓట్లు వెయ్యలేదు. మిగిలిన 39 మందిలో ఎవరైతే 18 నుంచి 19 ఓట్లు రాబట్టుకుంటారో వారే గెలిచినట్టు. అంటే 100 మందిలో కేవలం 19 మందికి ఆమోద‌యోగ్యంమైన వారే... మిగిలిన ప్రజలందరికి ప్రజా ప్రతినిధా ? అంటే మ‌న కర్మ అనుకోవాల్సిందే. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న పెద్ద లోపం. అందులో భాగస్వామ్యులైన ప్రజలదీనూ..! ఎవరు గెలిచినా మధ్యలో ఉన్న దళారీలను పట్టుకుంటే మనకు పనులు అయిపోతాయి. దీని కోసం మనం క్యూలో ఉండి ఎవరకో ఎందుకు ? ఓట్లు వెయ్యాలి. ఆ బాధ్యత పేదలది, మధ్య తరగతి వాళ్లది అన్న ఆలోచన ఈ ధనిక వర్గాలది. ఈ ఉన్నత వర్గాల వారి సంగతి పక్కన పెడితే, ఇదే పరిస్థితి ఉన్నత విద్యావంతుల్లోనూ ఉండడం మాత్రం శోఛ‌నీయమే. 


ఎవరు వచ్చినా మా పనులు ఆగవు... గెలిపించేది ఓట్లు వేసిన పేదలు, మధ్య తరగతైతే దాన్ని ఎంజాయ్‌ చేసేది మేము అన్నట్టుగా వీళ్ల ఆలోచనలు ఉంటున్నాయి. ఈ తర‌హా ఆలోచన ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ప్రమాదం. భవిష్యత్తులో అయినా ప్రభుత్వాలు, కోర్టులు ఓటింగ్‌ శాతంలో పెంచేలా చర్యలు తీసుకోవాలి. ఓట్లు వెయ్యని వారికి ప్రభుత్వం నుంచి అందే పథకాలు లేదా ఇతర‌త్రా అంశాలకు ముడి పెట్టినప్పుడే ఇందులో కొంతైనా మార్పు ఉండే ఛాన్సులు ఉన్నాయి. మరి ప్రభుత్వాలు, కోర్టులు ఈ దిశగా ఆలోచన చేస్తాయో ? లేదో చూడాలి.


Image result for democracy india

మరింత సమాచారం తెలుసుకోండి: