పీకే ప్రస్తుతం ఈ పేరు ఆంధ్రప్రదేశ్‌లో ఓ పెద్ద సంచలనం. పీకే ప్రధానంగా ఈ పేరు మూడు రకాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తోంది. పీకే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. గత ఎన్నికలకు ముందు పార్టీ పెట్టి ఈ ఎన్నికల్లో తొలి సారి పోటీ చేసిన పవన్‌ కళ్యాణ్‌ రెండు ప్రధాన పార్టీలు అయిన టీడీపీ, వైసీపీకి ముచ్చెమటలు పట్టించాడు. ఇప్పటికీ కూడా ఈవీఎంల‌లో నిక్షిప్తమై ఉన్న ఓట్లను చూసి ప్రధాన పార్టీల్లో ఎవ్వరూ కూడా ప్రశాంతంగా కునుకు తీసే పరిస్థితి లేదు. పీకే అంతిమంగా ఎవరిని దెబ్బ కొడతారన్నది ఎవరి అంచనాలకు అందడం లేదు. ప్రస్తుతం ఎవరు ఏం ? అనుకున్నా అవి కేవలం అంచనాలకు మాత్రమే పరిమితం. ఇక రెండో పీకే ప్రశాంత్‌ కిషోర్‌. వైసీపీ ఎన్నికల వ్యూహకర్త, ఏపీలో జగన్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు గత రెండు సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వ్యక్తి. 

Image result for pavan kalyan images

2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గెలుపుకు కీలకమైన వ్యూహాలు రూపొందించిన ప్రశాంత్‌ కిషోర్‌ ఆ తర్వాత మూడు రాష్ట్రాల్లో ఆయన పని చేసిన పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత బీహార్‌, ఢిల్లీ, పంజాబ్‌లో తిరుగులేని సక్సెస్‌ అయిన ప్రశాంత్‌ కిషోర్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం ఫేల్‌ అయ్యారు. యూపీలో బీజేపీకి వ్యతిరేఖంగా కాంగ్రెస్ + ఎస్పీ కూటమికి పని చేసిన ప్రశాంత్‌ కిషోర్‌ లెక్కలు అక్కడ మాత్రం తప్పాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ పీకే రెండు సంవత్సరాలుగా ఇక్కడ జగన్‌ కోసం పని చెయ్యడం, ఆయన టీం ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వేలు చెయ్యడం, వాళ్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా కూడా జగన్‌ కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చడం జరిగింది.  ఈ లెక్కన చూస్తే జగన్‌ పీకేకి ఎంత ప్ర‌యార్టీ ఇచ్చాడో తెలుస్తోంది. ఎన్నికల చివరి వరకు కూడా జగన్‌ పీకే వ్యూహాలు అనుసరిస్తూనే ఉన్నాడు. 

Image result for pasupu kumkuma scheme

ఇప్పుడు ఎన్నికలు ముగిసాక పీకే టీం వైసీపీ 115 నుంచి 125 సీట్ల వరకు గెలుస్తుందని లెక్కలు వేసుకుంటుంది. ఫైన‌ల్‌గా చెప్పాలంటే  ఏపీలో తెలుగుదేశం పార్టీని ప్రశాంత్‌ కిషోర్‌ ముప్ప తిప్పలు పెట్టడంతో పాటు, ఆ పార్టీ శ్రేణులకు తీవ్రమైన అసహనం కలిగించాడు. చివరకు చంద్రబాబు సైతం పీకేను నేరుగానే టార్గెట్‌ చేస్తు ఇక్కడ బిహారీ రాజ్యం తెస్తాడని విమర్శలు చేశారు. దీనిని బట్టీ పీకే అనే పేరు చంద్రబాబును ఎంత ఇరిటేట్‌ చేసిందో తెలుస్తోంది. ఇక మూడో పీకే చంద్రబాబుది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే అది పసుపు-కుంకుమే అని చెప్పాలి. ఓ విధంగా చెప్పాలంటే ఇది ఈ ఎన్నికల వరకు ప‌సుపు - కుంకుమ చంద్రబాబు పాలిట బ్రహ్మాస్త్రంగా మారింది. బారులు తీరు రాత్రి పది గంటల వరకు ఓట్లు వేసిన మహిళలపై ఈ పసుపు-కుంకుమ ప్రభావం ఎక్కువ ఉందన్న అంచనాలు ఉన్నాయి.

Image result for prashant kishor

వైసీపీ తాము గెలుస్తామని, 125 సీట్లు సాధిస్తామని పైకి మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన‌ మాత్రం వాళ్లను ఈ పసుపు- కుంకుమ ఎక్కడ దెబ్బ కొడుతుందో అన్న ఆందోళన వెంటాడుతోంది. పసుపు- కుంకుమలో చివరి 4,000 కూడా అందరి అకౌంట్లలోకి వెళ్లేలా చెయ్యడంలో టీడీపీ ప్రభుత్వం సక్సెస్‌ అయ్యింది. అలాగే ఆ గ్రూపులో ప్రతీ ఒక్కరిలో పసుపు- కుంకుమ సెంటిమెంట్‌ రగల్చడంలోనూ టీడీపీ సక్సెస్‌ అయ్యింది. ఓవర్‌ ఆల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఎన్నికలు ఈ ముగ్గురు పీకేలా చుట్టూనే తిరిగాయి. మరి ఈ ముగ్గురు పీకేలాలో ఏ పీకే సక్సెస్‌ అయ్యారన్నది ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే తెలియనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: