విజయంపై నమ్మకమే లేకపోతే పోరాటం చేయలేం.. అందుకు పరిస్థితులు ఎలా ఉన్నా.. రణరంగంలో దిగే ముందు గెలుపు ఖాయమనే నమ్మాలి. యుద్దానికి వెళ్లే ముందు.. యుద్ధరంగంలో ఉన్నంత వరకూ ఈ థియరీ ఓకే.. మరి యుద్ధం తర్వాత..


రణం ముగిశాకైనా సమీక్ష నిజాయితీగా జరగాలి కదా. ఇప్పుడు జనసేన విషయంలో జరుగుతున్నది ఇదే. ఏ సర్వే, ఏ ప్రధాన పార్టీ నాయకుడు కూడా జనసేన పట్టుమని పది సీట్లు గెలుస్తుందని చెప్పడం లేదు. కానీ ఆ పార్టీ నాయకుల లెక్కలు వేరేగా ఉన్నాయి. 

తాము కనీసం 22 స్థానాల్లో గెలవబోతున్నామని ఆ పార్టీ నేతలు అంతర్గతంగా లెక్కలు వేసుకుంటున్నారట. ఏ ఏ స్థానాల్లో గెలుస్తామో కూడా లిస్టు తయారు చేసేశారు. వారి లెక్కల ప్రకారం జనసేన గెలిచే స్థానాలు ఇవే.. 

విశాఖ జిల్లా : 3

గాజువాక
పెందుర్తి
యలమంచిలి
విశాఖ పట్నం ( ఎంపీ ) 


తూర్పు గోదావరి : 9

పిఠాపురం
పెద్దాపురం
రాజోలు
కాకినాడ రూరల్
అమలాపురం
పి.గన్నవరం
రాజమండ్రి రూరల్
ముమ్మిడివరం
కొత్తపేట,


పశ్చిమ గోదావరి : 4

భీమవరం
తాడేపల్లిగూడెం
నిడదవోలు
నరసాపురం


కృష్ణా జిల్లా:  2

పెడన
విజయవాడ వెస్ట్


గుంటూరు జిల్లా: 2
గుంటూరు వెస్ట్
తెనాలి


చిత్తూరు జిల్లా: 1 
తిరుపతి


కర్నూలు జిల్లా: 1
నంద్యాల

ఇవన్నీ జనసేన నాయకుల లెక్కలు.. కానీ వాస్తవంగా చూస్తే.. ఇందులో 10-15 స్థానాలు గెలుచుకున్నా.. భవిష్యత్తులో జనసేన ఓ సత్తా ఉన్న పార్టీగా నిలబడే అవకాశాలు ఉంటాయి. ప్రధాన పార్టీలు లెక్కలు వేసినట్టు సింగిల్ డిజిట్‌కు పరిమితమైతే.. మాత్రం పార్టీ మనుగడ కష్టమే.



మరింత సమాచారం తెలుసుకోండి: