ఎన్నికల హడావిడి ముగిసింది. ఫలితాలకు ఎన్నడూ లేని విధంగా.. 40 రోజులకుపైగా సమయం ఉంది. అందుకే చాలా మంది నేతలు రిలాక్స్ మోడ్‌ లోకి వెళ్లిపోతున్నారు. దాదాపు 2 నెలల నుంచి.. ప్రచారంలో నెలరోజులపాటు నిద్రాహారాలు చూసుకోకుండా గడిపిన నేతలు ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. 


మరి ఈ నలబై రోజులు జగన్ ఏం చేయబోతున్నారు..అసలే ఎండల్లో ప్రచారం చేసిన జగన్ కాస్త నలుపు రంగకు వచ్చారు. విశ్రాంతితో పాటు నిపుణుల సలహాలు తీసుకుని ఆ నలుపు తగ్గించుకునే ప్లాన్ ఉందట. ఆ తర్వాత ఫ్యామిలీతో ఫారిన్ టూర్ కూడా అనుకున్నారట.

కానీ.. ఈ చంద్రబాబు వైఖరితో జగన్ షెడ్యూల్‌ లోనూ మార్పులు వస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఏపీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ దిల్లీ వీధుల్లో గోలగోల చేస్తుండటంతో తాము సైలంట్ మోడ్‌లో ఉండే ఇబ్బందేనని జగన్ భావిస్తున్నారు. 

ఈవీఎంలు ఉంచి స్ట్రాంగ్ రూమ్‌లపై ఓ కన్నేయడం.. చంద్రబాబు విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం వంటి చర్యలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎన్నికల్లో వివిధ కారణాలతో చాలామంది అర్హులకు కూడా టికెట్‌ ఇవ్వలేకపోయారు. అలాంటి వారిని పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. అధికారంలోకి వస్తే.. ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలనే అంశంపైనా జగన్ మథనం చేయనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: