తెలంగాణాలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకిక్ ట్ర‌బుల్ షూట‌ర్‌ గా పేరొందిన మాజీ మంత్రి, కేసీఆర్ మేన‌ల్లుడు, తన్నీరు హ‌రీష్ రావు విష‌యంలో ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్. కేసీఆర్ తనయుడు కేటీఆర్ సడన్ గా వెన‌క్కు త‌గ్గారు. త‌న బావ‌తో గతంలో సవాల్ విసిరిన కేటీఆర్‌, ఆ స‌వాల్ నుంచి మిడిల్ డ్రాప్ అయ్యారు. దిగితే కాని లోతు తెలవదు - అది తెలిశాక తాను స‌ర‌దాకు మాత్ర‌మే ఆ స‌వాల్ విసిరానని నాటి స‌వాల్ గురించి లోతు తెలుసుకొని ఇప్పుడు కేటీఆర్ కు ఫికర్ పట్టుకొని ఉంటుందని అనుకుంటున్నారు.
Image result for ktr challenge to harish rao
ఎన్నికల‌ ఫ‌లితాల‌కు ముందే, ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. నిన్న సీతారామ కళ్యాణం సందర్భంగా పందిళ్ళలో నలుగురు కూర్చున్న చోట ఇదే ముచ్చట. టీఅర్ఎస్ ఈ లోక్ సభ ఎన్నికల్లో ఎంతగా ఫేర్ చెయ్యకపోవచ్చని అంటున్నారు. దానికి తగ్గట్టే కేటీఅర్  మాటలు ముచ్చట్లు ఉండటం, జనంలో కొన్ని కొత్త భావనలు పొడచూపుతున్నాయి. 

Image result for KTR Harish

అయితే కేసీఆర్ నియంతృత్వ పోకడలు కూడా చర్చకు వచ్చాయి. శాసనసభ ఎన్నికలైన తరవాత మూణ్ణెల్లకు గాని మంత్రి మండలి రూపుదిద్దుకోక పోవటం, తొలి నుంచి సచివాలయానికి కెసీఆర్ అసలే రాకపోవటం, 88 నుంచి 90 శాసనసభ స్థానాల ను గెలిపించిన ప్రజల మనసుల్లో కేసీఆర్ ప్రతిపక్ష నిర్మూలన కార్యక్రమం సహించలేక పోతున్నారు.  కాంగ్రెస్ ఎమెల్యే లను గోడ దూకించటం జనాల్లో కేసీఆర్ పట్ల ఒక రకమైన విద్వేష భావనలు పొడచూపుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.

Related image

నిశ్శబ్ధంగా ఉంటూనే రాజకీయ చైతన్యం కలిగి ఉండే తెలంగాణా ప్రజలు ప్రజాస్వామ్యానికి పట్తుగొమ్మైన "ప్రతిపక్షం" ను పూర్తిగా నిర్మూలించే ప్రయత్నాన్ని వ్యతిరేఖిస్తు న్నారు. ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించనున్నదని అంటున్నారు. దీన్ని బట్టి కేసీఆర్ కోటకు బీటలు వారనున్నాయా? అనే అనుమానాలు అంతటా వినిపిస్తున్నాయి.   

bandi sanjay కోసం చిత్ర ఫలితం
నిజామాబాద్ కరీంనగర్ లో పుంజుకున్న బిజెపి. నల్గొండలో పరుగు పెంచిన కోమటిరెడ్డి బ్రదర్స్ అద్వర్యంలో కాంగ్రెస్, మల్కాజ్ గిరిలో టీఆరెస్ అభ్యర్ధిపట్ల ప్రజల్లో వైముఖ్యం రేవంత్ కు శుభశకునాలే అంటున్నారు. ఇదంతా చూస్తుంటే టీఅరెస్ కు కష్టకాలం దాపురించినట్లే ఉందని తెలుస్తుంది. శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబును నిరోధించటానికి ప్రజలంతా ఐఖ్యంగా టీఅరెస్ కు ఓటేసి గెలిపించినా - టీఅరెస్ కు చెక్ పెట్టేటందుకు నిశ్శబ్ధంగా ఓట్ చేశారని అంటున్నారు. 

revanth attgack in malkajgiri on TRS కోసం చిత్ర ఫలితం

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే, కొద్ది కాలం క్రితం జ‌రిగిన మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఏకంగా ఆ పార్టీ సీనియర్ నేత హ‌రీష్ రావుకు స‌వాల్ విసిరారు.
Image result for ktr challenge to harish rao
"మెదక్‌ పార్లమెంట్‌ కంటే కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధి లోనే టీఅర్ ఎస్ కు ఎక్కువ మెజార్టీ సాధించి పెడతామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. దీనిపై మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గం లోని ప్రజా ప్రతినిధులకు సవాల్‌ చేస్తున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గం కంటే మేమే ఒక్క ఓటన్న ఎక్కువ తెచ్చుకొని మీ కంటే ముందుంటాం" అని నాడు కేటీఆర్‌ స‌వాల్ విసిరారు. 
Image result for ktr challenge to harish rao
అయితే, పోలింగ్ పూర్త‌యిన త‌ర్వాత తాజాగా కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మీడియాతో చిట్‌-చాట్‌ నిర్వహించిన సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, మెదక్‌, సీఎం కేసీఆర్‌ ఇలాక అని, అక్కడ కచ్చితంగా టీఆర్ఎస్‌కు భారీ మెజారిటీ వస్తుందన్నారు. ఎన్నికల్లో ప్రజలను ఉత్తేజ పరచడానికే తన బావ హరీష్ రావుతో సరదా గా ఛాలెంజ్‌ విసిరానని చెప్పారు. మెజారిటీలో మొదక్‌ మొదటి స్థానంలో, వరంగల్ రెండో స్థానంలో, కరీంనగర్‌ మూడు లేదా నాలుగో స్థానంలో నిలుస్తాయని అన్నారు.  అయితే, కేటీఆర్ ఇలా మిడిల్ డ్రాప్ అవ‌డం స‌హ‌జంగానే కొత్తగా ప్రజల్లో మారుతున్న పరిస్థితుల దృశ్యాలతో ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: