ప్రస్తుతం రాంపూర్ రాజకీయం వేడెక్కుతోంది.  బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రదను ఉద్దేశించి ఎస్పీ అభ్యర్థి అజంఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.  జయప్రదను రాంపూర్ తీసుకొచ్చింది తానేనని కానీ అప్పుడు ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుందని గుర్తించలేకపోయాయని అజంఖాన్ అన్నారు. దాంతో తనను అవమాన పరిచే విధంగా  అజంఖాన్ మాట్లాడారని జయప్రద ఆవేదన చెందారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.   


అజంఖాన్‌ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆయనకు నోటీసులు జారీ చేసింది.  తాజాగా ఈ విషయంపై జయప్రద స్పందిస్తూ..మహిళలపై గౌరవం లేని వ్యక్తుల్ని పోటీ చేయకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారామె. ఇలాంటి వారు గెలిస్తే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుందన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు జయప్రద.  


ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాంపూర్ వదిలి వెళ్ళిపోతానని అనుకుంటున్నారేమేమో.  నేను ఎక్కడికీ వెళ్ళను.  ఇలాంటి వ్యక్తులు గెలిస్తే మహిళలకు రక్షణ ఏం ఉంటుంది  అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ యూపీ ప్రచార కమిటీ ఇన్ చార్జ్ ప్రియాంక గాంధీపై కూడా పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ పరంగా కాకుండా వ్యక్తిగతంగా వ్యాఖ్యానించటం సరికాదనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: