మంగళగిరి.. ఇప్పుడు అందరి చూపూ దీనివైపే.. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ పోటీచేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. అందులోనూ ఇది వైసీపీ సిట్టింగ్ స్థానం.. గతంలోనూ ఇక్కడ టఫ్ ఫైట్ జరిగింది. సీఎం కొడుకు కావడంతో ఇక్కడ అన్నిరకాలుగానూ టీడీపీ విజయం కోసం ప్రయత్నాలు చేసింది. 


ఐతే.. బెట్టింగ్ రాయుళ్లు మాత్రం వైసీపీయే గెలుస్తుందని నమ్ముతున్నారట. లోకేశ్‌ గెలుస్తాడు అని బెట్టింగ్‌ వేసే వారికి ఒకటికి 1.5 నుంచి రెండు రెట్లు ఇస్తామంటున్నారు. అంటే లోకేశ్‌ వైపు రూ.లక్ష పందెం కాస్తే లక్షా యాభైవేల నుంచి రెండు లక్షలు ఇస్తారన్నమాట. 

సీఎం తనయుడు, కాబోయే సీఎంగా పేరున్న లోకేశ్ గెలుపు కోసం టీడీపీ తీవ్ర కసరత్తు చేసింది. కానీ చాలా ప్రాంతాల్లో టీడీపీ నాయకులు లోకేశ్‌కు హ్యాండ్‌ ఇచ్చారట. డబ్బులు అందగానే అవి పంచకుండా తమ దారి తాము చూసుకున్నారట. లోకేశ్‌ గెలిస్తే తాడేపల్లి మండలంలో కొండలపై ఉన్న వారి ఇళ్లను తొలగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. 

అంతే కాకుండా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని ప్రకటించారు. అప్పటిదాకా ఉన్న సమీకరణాల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. ఆర్కే మంత్రిగా ఉంటే తమ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తటస్త ఓటర్లు భావించారు. దీంతో అన్ని వర్గాల ఓటర్లతో స్పష్టంగా ఆర్కేను గెలిపించుకుందామనే భావన వ్యక్తమవడంతో లోకేశ్‌ ఓడిపోతారనే ప్రచారం జోరుగాసాగుతోంది. ఆ నమ్మకంతోనే పంటర్లు లోకేశ్ ఓడిపోతున్నాడని అంతగా పందేలు కాస్తున్నారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: