సాధారణంగా కోతి అంటే ఆంజనేయ స్వామి ప్రతిరూపంగా భావిస్తుంటారు.  ఎక్కువ శాతం దేవాలయాల్లో ఈ కోతులు దర్శనమిస్తుంటాయి..భక్తులు వేసే కొబ్బరి చిప్పలు..పండ్లూ ఫలాలు వాటికి భోజనంగా వేస్తుంటారు.  అయితే కొన్ని కోతులు మాత్రం ఇళ్ల మద్యనో ఉంటూ అక్కడి వారిని నానా ఇబ్బందులకు గురి చేయడం చూస్తూనే ఉంటాం.  తాజాగా ఓ కోతి మాత్రం విలన్ అవతారం ఎత్తింది..ఒక దశలో ఆ కోతిని చూస్తే మనుషులు భయపడే పరిస్థితి నెలకొంది.  హైదరాబాద్‌కు చెందిన బండ్లగూడ జాగీర్ ప్రాంతంలో కొన్ని నెలలుగా ఓ కోతి.. క్రూర మృగం కంటే ఎక్కువ ప్రమాదకరంగా మారింది. 

ఆ కోతికి ఆకలి వేస్తే ఇళ్లల్లోకి చొరబడి ఏది అందితే అది తినేస్తుంది..దానికి ఏ వస్తువు లభించకపోతే ఇళ్లంతా చిందరవందర చేస్తేస్తుంది. ఆ కోతిని వెళ్లగొట్టాలని ప్రయత్ని మీదకు ఎగబడి రక్కేస్తుంది..నానా బీభత్సం సృష్టిస్తుంది.  పెంపుడు కుక్కలు  మీదకు వెళితే.. వాటి ప్రాణాలు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి.  ఈ కోతి గ్రామానికి దగ్గర్లో ఉన్న గుడి దగ్గర్నుంచి వచ్చి ఆ గ్రామంలోనే స్థిరపడిపోయింది.  దీని బాధ పడలేక అధికారులకు చెబితే వారు కూడా పట్టించుకోక పోవడంతో అక్కడి ప్రజలు బిక్కు బిక్కుమంటూ ఉండే పరిస్థితో పాటు పట్టపగలే కిటికీలు, తలుపు మూసుకొని ఇళ్లళ్లో ఉండే పరిస్థితి నెలకొంది.

జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తే... గ్రామ పంచాయతీ పరిధికే చెందుతుందని, పంచాయతీ ఆఫీసుకు వెళ్తే జీహెచ్ఎంసీ వాళ్లే పట్టించుకోవాలని దాటేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై  జీహెచ్ఎంసీ అధికారి ఒకరు స్పందిస్తూ.. అటవీ శాఖతో చర్చలు జరిపి తీసుకుని వెళ్లి అడవిలో వదిలేయాలి అని అన్నారు.  మరి ఈ కోతి బాద ఎప్పుడు పోతుందో అని స్థానికులు బాధపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: