విశాఖ పట్నంలో జనసేన అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ గెలవబోతున్నారు.. ఇదీ ఇటీవల విస్తృతంగా సాగుతున్న ప్రచారం. ఇందుకు కారణాలు కూడా విశ్లేషించవచ్చు. విశాఖపట్నం ఎంపీ స్థానంలో క్రాస్ ఓటింగ్ జరిగి జేడీ  లక్ష్మీనారాయణ గెలిచే అవకాశం పుష్కలంగా ఉందని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఓ ఛానల్లో విశ్లేషించారు.


నాగేశ్వర్ విశ్లేషణ: 
గతంలో జేడీ లక్ష్మీనారాయణను తెలుగుదేశం జగన్‌ అవినీతిని  బట్టబయలు చేస్తున్న హీరోగా చిత్రీకరించారు. అప్పట్లో దీనిపై చాలా స్ఫూఫ్‌లు కూడా వచ్చాయి. అలా జేడీ యాంటీ జగన్ పర్సన్‌ గా ప్రొజెక్ట్ అయ్యారు. ఇప్పుడు విశాఖలో టీడీపీ ఓట్లు ఎమ్మెల్యేలకు టీడీపీకి వేసి.. ఎంపీ స్థానానికి జేడీపై అభిమానంతో క్రాస్ ఓటింగ్ చేయవచ్చు. 

టీడీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినంతగా వైసీపీ నుంచి జరగదు. ఎందుకంటే.. జగన్ ఓటు బ్యాంక్ ఎక్కువగా జగన్ సీఎం కావాలనే వారే ఉంటారు. సో.. వాళ్లు జేడీపైపు ఎట్రాక్ట్ కారు. ఇక ఈ రెండు పార్టీలకు సంబంధించని మిగిలిన పార్టీల వారు కూడా జేడీ వ్యక్తిత్వం వల్ల ఆకర్షితులై ఆయనకు ఓటేసే ఛాన్స్ ఉంది. 

జేడీ పోలీస్ ఆఫీసర్ గానే కాకుండా,..వ్యక్తిత్వ వికాస నిపుణుడుగానూ పేరుంది. సో..యువతరం, మిలీనియల్ ఓటరు, తటస్థ ఓటరు ఆయనవైపు ఆకర్షితులు కావచ్చు. ఇవన్నీ పని చేసి జేడీ గెలిస్తే.. చంద్రబాబుకు కొత్త కష్టాలు వస్తాయి. చంద్రబాబు కావాలనే  జేడీని గెలిపించారని ఇప్పటికే ప్రచారం సాగుతోంది. చంద్రబాబు మరోసారి సొంత కుటుంబసభ్యుడిని ఓడించారని ఆయన వ్యతిరేక వర్గాలు ప్రచారం చేస్తాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: