గుజరాత్ లో కాంగ్రెస్ నేత హార్థిక్ పటేల్ కి ఛేదు అనుభవం ఎదురైంది.  గుజరాత్ లోని సురేందర్ నగర్ లో ఓ కార్యక్రమంలో భాగంగా హార్థిక్ పటేల్ స్టేజిపైన మాట్లాడుతుండగా..ఓ అజ్ఞాత వ్యక్తి వచ్చి హార్థిక్ పటేల్ చెంప ఛెల్లుమనిపించాడు.

దాంతో నిశ్చేష్టుడయ్యాడు హార్థిక్ పటేల్.  వెంటనే అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యక్తలు అతన్ని పక్కుకు జరిపి నింధితుడిని పట్టుకొని చితక బాదారు. పాటిదార్ ఆందోళన్ సమితి అధ్యక్షుడు హార్థిక్ పటేల్‌ ఆ మద్య గుజరాత్ ఎన్నికల్లో ముఖ్య భూకి పోషించారు. 

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయనకు కోర్టు లో కేసులు ఉన్న కారణంగా అనర్హుడిగా ప్రకటించారు.  ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయతే దాడి చేసిన వ్యక్తి ఎవరు..ఎందుకు చేశాడన్న విషయం తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: